• తాజా వార్తలు

మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ను ఫ్లీట్ పేరుతో ఇటీవలే తీసుకొచ్చింది. ఇపుడు మీ నోటి మాటనే ట్వీటుగా చేసే వాయిస్ ట్వీటింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. 

ఏమిటి స్పెష‌ల్‌?
సాధార‌ణంగా ఒక ట్వీటులో మాక్సిమం 280 క్యారెక్టర్స్ మాత్రమే ట్వీట్ చేయగలం. అయితే ఈ వాయిస్ ట్వీటింగ్ లో 140 సెకన్ల నిడివి గల వాయిస్ మెసేజ్ ట్వీట్ చేయొచ్చు. దీని వల్ల సాధారణ ట్వీట్ కంటే ఎక్కువ విషయాన్ని ఒకే ట్వీట్‌లో చెప్పగలిగే సౌకర్యం వచ్చినట్టే.

వాయిస్ ట్వీట్ ఎలా చేయాలి ? 
బుధవారమే ఈ వాయిస్ ట్వీట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఐవోయస్ యూజర్లకు మాత్రమే ఈ వాయిస్ ట్వీట్  ఫీచ‌ర్‌ను ట్విటర్ రిలీజ్ చేసింది. 

* ముందుగా మీ ఐఫోన్లో ట్విట‌ర్ యాప్ అప్డేట్ చేయండి. 

* ఇప్పుడు ట్విట్టర్ యాప్ ఓపెన్  చేయండి. 

* ట్వీట్ కంపోజింగ్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. 

* కెమెరా ఐకాన్ పక్కన వేవ్ లెంగ్త్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని టాప్ చేస్తే కింద మీ ప్రొఫైల్ ఫొటోతో పాటు రికార్డు బటన్ కనిపిస్తుంది. 

* రికార్డు బ‌ట‌న్ క్లిక్ చేసి రికార్డ్ చేయ‌డ‌మే . 140 సెక‌న్ల పాటు మీ వాయిస్ లేదా ఆడియో ఫైల్‌ను రికార్డ్ చేయొచ్చు. లేదా ఏద‌న్నా పాట పాడొచ్చు. మీ గొంతుతో ఏం చేసినా అది మీ ఇష్టం.  రికార్డింగ్ పూర్త‌వగానే డ‌న్ నొక్కండి.

* ఈ వాయిస్ ట్వీట్‌కు మీరు టెస్ట్ కూడా యాడ్ చేయొచ్చు.

* అది కూడా పూర్త‌యితే ట్వీట్ చేసేయ‌డ‌మే. 

జన రంజకమైన వార్తలు