కంప్యూటర్‌లో వెబ్‌కామ్ గురించి అందరికి తెలుసు. ఫొటోలు తీసుకుని పంపుకోవడానికి, అప్‌లోడ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు స్కైప్ ఉపయోగించడానికి వెబ్‌కామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మీకు దగ్గర్లో కంప్యూటర్ లేదు. అర్జెంట్‌గా వెబ్‌కామ్ కావాలి. మరి అప్పుడేం చేస్తాం?.. సింపుల్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌నే వెబ్‌కామ్‌గా ఉపయోగించుకుంటే సరి!! అదేంటి ఆండ్రాయిడ్ ఫోన్‌ను వెబ్‌కామ్‌గా ఎలా ఉపయోగించుకోవాలి.. దీనికి ఏంటి మార్గాలు!
ఆండ్రాయిడ్ ద్వారా చాలా ఉపయోగాలున్నాయన్న సంగతి తెలిసిందే. కెమెరాలో ఫ్రంట్, బ్యాక్ కెమెరా ద్వారా మనం ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అయితే వెబ్‌కామ్‌లా యూజ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం రిజల్యూషన్ ఎక్కువే ఉండాలి. బెటర్ వీడియో క్వాలిటీ ఇస్తూ మన ఆండ్రాయిడ్ ఫోన్‌నే వెబ్‌కామ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలంటే..
డ్రాయిడ్‌కామ్ వైర్‌లెస్ వెబ్‌కామ్
ఆండ్రాయిడ్ ఫోన్‌ను వెబ్‌కామ్‌గా ఉపయోగించుకోవడానికి డ్రాయిడ్‌కామ్ యాప్ ఉపయోగపడుతుంది. వైఫై నెట్‌వర్క్ ద్వారా వైర్‌లెస్ ద్వారా పీసీ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వెబ్‌కామ్ ఆప్షన్‌ను యూజ్ చేసుకోవచ్చు. దీని వల్ల వీడియో క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఆడియో ఇన్‌పుట్ కోసం ఆడియోను కూడా అనేబుల్ చేసుకోవచ్చు.
ఎంకామ్ వెబ్‌కామ్
ఎంకామ్ అనేది మరో ఉచితంగా లభించే ఆండ్రాయిడ్ యాప్. డ్రాయిడ్‌కామ్ మాదిరే ఇది కూడా పని చేస్తుంది. అయితే ఇది వైర్‌లెస్‌గా పని చేస్తూ విండోస్, మాక్ ఓఎస్, ఉబంటు ఓఎస్‌ల ద్వారా మాత్రమే వర్క్ చేస్తుంది. ముందుంగా ఎంకామ్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని .. వైఫై ద్వారా పీసీకి కనెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే డెస్క్ టాప్ క్లైయింట్ నుంచి వీడియో ఫీడ్ తీసకుంటుంది.
యాష్ లైవ్ డ్రాయిడ్
మొబైల్ ఫోన్‌ను వెబ్‌కామ్‌గా మార్చడానికి మరో పద్ధతి యాష్ లైవ్ డ్రాయిడ్ యాప్. ఇది కూడా మిగిలిన యాప్‌ల మాదిరే పని చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్లో కూడా పని చేస్తుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్‌ను, పీసీని ఒకే వైఫైకి కనెక్ట్ చేయాలి వ్యూ ఫోర్ గ్రౌండ్ లేదా రన్ ఇన్ బ్యాక్ గ్రౌండ్ ఈ రెండింట్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. యాప్ ఆటోమెటిక్‌గా కెమెరా ఫీడ్‌ను బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది.