• తాజా వార్తలు

కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

కీబోర్డు ఓనెన్ చేయగానే మనకు ఏబీసీడీలతో పాటు కొన్ని కీస్ కనిపిస్తాయి. వాటిని మనం ఉపయోగించేది చాలా తక్కువ. కానీ ప్రతి కీ బోర్డులోనూ ఈ కీస్ మాత్రం తప్పకుండా ఉంటాయి. ఆ కీసే ఎఫ్ కీస్. ఎఫ్ 1 నుంచి మొదలుకొని  ఎఫ్ 12 వరకు ప్రతి కీబోర్డులోనూ ఈ కీస్ కనిపిస్తాయి. మాగ్జిమం మనం ఎఫ్ 1 మాత్రమే యూజ్ చేస్తాం.. మరి మిగిలిన కీస్ వల్ల ఉపయోగం ఏమిటి?
 

ఎఫ్ 1 నుంచి..

కంప్యూటర్లో మనకు  ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే ఎఫ్ 1 ప్రెస్ చేస్తాం. అంటే ఇది ఎస్కేప్ బటన్ లాంటిది. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే హెల్ప్ కోసం ఎఫ్ 1 నొక్కుతాం. కొన్ని కంప్యూటర్లలో ఎఫ్ 1 బటన్ ను బేసిక్ ిఇన్ పుట్ అవుట్ పుట్ సిస్టమ్ యాక్సెస్ కోసం వాడతారు. 

నేమ్ ఛేంజర్

ఎఫ్ 2 బటన్ ను సాధారణంగా రినేమింగ్ కోసం వాడతాం. అంటే ఏదైనా ఫైల్ లేదా ఫోల్డర్ పేరును మార్చాలనుకుంటే  వాటిపై రైట్ క్లిక్ చేసి రినేమ్ చేయకుండా నేరుగా ఎఫ్ 2 ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంటే ిఇదో షార్ట్ కట్ అనమాట. మైక్రో సాఫ్ట్ వర్డ్లో ఎఫ్ 2 కీతో పాటు కంట్రోల్ బటన్ నొక్కితే ప్రింట్ ప్రివ్యూ విండో ఓపెన్ అవుతుంది. 

ద సెర్చర్

ఎఫ్ 3 కీని ప్రొగ్రామ్ సెర్చ్ విండోగా వాడతారు. దీన్ని ఏదైనా వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి ప్రయత్నించాలి. మీరు చూస్తున్న పేజీలో ఫలానా టెక్టు కోసం ఈ కీని వాడతారు. ఒకసారి ఎఫ్ 3ని నొక్కిన తర్వాత మళ్లీ అదే పదం ఆ పేజీలో ఎన్ని సార్లు ఉందో కూడా సెర్చ్ చేసుకోవచ్చు.

అడ్రెస్ అండ్ క్లోజర్

ఎఫ్ 4 కీని విండోస్ ఎక్స్ ప్లోరర్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్లో విండోస్ ని  ఓపెన్, క్లోజ్ చేయడం లాంటి ఆపరేషన్ల కోసం ఎఫ్ 4 బటన్ ను యూజ్ చేస్తారు. ఈ బటన్ వల్ల మీరు రీసెంట్ గా యూజ్ చేసిన లొకేషన్లకు కూడా సులభంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు