• తాజా వార్తలు

కీబోర్డులో ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా (పార్ట్‌-2)

కీబోర్డు చూడ‌గానే మ‌న‌కు క‌నిపించేవి ఎఫ్ పేరుతో ఉండే అంకెలే. వాటి వాళ్ల ఏంటి ఉప‌యోగం? మ‌నకు తెలిసివ‌ని.. మ‌నం వాడేవి చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్కేప్ అని ఉంటుంది ఏదైనా స్ట్ర‌క్ అయిన‌ప్పుడో లేదా విండో క్లోజ్ చేయాల‌నుకున్న‌ప్పుడో ఉప‌యోగిస్తాం... అలాగే బ్యాక్ స్సేస్‌, డిలీట్, షిప్ట్‌, ఎంట‌ర్‌, కంట్రోల్‌, క్యాప్స్ లాక్‌, డిలీట్, ట్యాబ్ బ‌ట‌న్‌ల‌ను ఎక్కువ‌గా ప్రెస్ చేస్తాం. మ‌రి ఫంక్ష‌న్‌ కీస్‌ను ఎందుకు యూజ్ చేస్తాం.. ఎందుకో తెలుసుకుందాం..!

రిఫ్రెషింగ్ (ఎఫ్ 5)
మ‌నం కంప్యూట‌ర్‌లో ఒక విండోని ఓపెన్ చేశాం.  దానిలో కొన్ని అప్‌డేట్స్ చేశాం.. కానీ అది పాత వాటినే చూపిస్తుంది అనుకోండి.. అలాంటి ప‌రిస్థితిలో రిఫ్రెష్ కొడ‌తాం.. అందుకోసం మ‌నం యూజ్ చేసే కీ పేరే ఎఫ్ 5. పేజీని రిఫ్రెష్ చేయ‌డం వ‌ల్ల కొత్త అప్‌డేట్స్ మ‌న‌కు క‌నిపిస్తాయి. అంటే పేజీని రిలోడ్ చేయ‌డం కోసం ఈ ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఎఫ్ 5 బ‌ట‌న్ ప్రెస్ చేయ‌డం వ‌ల్ల మ‌నం ప్రొగ్రామ్‌కు కొత్త ఇన్ఫ‌ర్మేష‌న్ డిస్ ప్లే చేయ‌మ‌ని క‌మాండ్ ఇచ్చినట్లు. 

సైకిల్ అరౌండ్ (ఎఫ్ 6)
ఏ ప్రొగ్రామ్‌లో నైనా మ‌నం కొన్ని ప్లేస్‌ల‌ను క‌ర్స‌ర్‌తో సెల‌క్ట్ చేస్తుంటాం. ఎఫ్ 6 కీని ట్యాప్ చేయ‌డం ద్వారా మ‌నం పేజీలో ఎక్క‌డ అనుకుంటే అక్క‌డ క‌ర్స‌ర్‌ని వేగంగా క‌దిలించొచ్చు. మ‌నం అనుకున్న ప్లేస్‌ని లేదా లెట‌ర్స్‌ని సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. అంటే ఒక పేజీలో క‌ర్స‌ర్ వేగంగా తిర‌గడానికి ఈ ఎఫ్ 6 బ‌ట‌న్ బాగా వ‌ర్క్ అవుతుంది. అంటే మీ మౌస్‌కు ప‌ని భారం త‌గ్గించ‌డానికి ఈ కీస్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

చెక్ యువ‌ర్ సెల్ఫ్ (ఎఫ్ 8)
విండోస్ పాత వెర్ష‌న్ల‌లో మనం ఎఫ్ 8ని ప్రెస్ చేస్తే కంప్యూట‌ర్ ఆటోమెటిక్‌గా  సేఫ్ మోడ్‌లో బూట్ అవుతుంది. ప్రాబ్ల‌మ్ ట్ర‌బుల్ షూటింగ్ కోసం ఎఫ్ 8 కీని యూజ్ చేస్తాం. మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌లో అయితే ఎఫ్ 8ని ట్యాప్ చేయ‌డం ద్వారా టెక్ట్  సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. ఒక‌సారి ఎఫ్ 8 ట్యాప్ చేస్తే మొత్తం వ‌ర్డ్ సెల‌క్ట్ అవుతుంది. 

క్లియ‌ర్ అండ్ కాలిక్యులెటింగ్ (ఎఫ్ 9)
మీ మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌లో ఎక్కువ ఫిల‌బుల్ ఫీల్డ్స్ లేదా టేబుల్స్ విత్ ఫార్ములాస్ ఉంటే ఎఫ్‌9ని ట్యాప్ చేయాలి. ఇలా చేయ‌డం ద్వారా ఫీల్డ్స్ అప్‌డేట్ అవుతాయి. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఎఫ్ 9ని ట్యాప్ చేస్తే మొత్తం ఫీల్డ్స్ అన్ని ఫిల్ అవుతాయి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో  ఎఫ్ 9 ప్రెస్ చేయ‌డం ద్వారా సెల్ రిఫెరెన్స్‌లు ప్లెయిన్ వాల్యూస్‌గా మార‌తాయి. వ‌ర్క్ షీట్ రి కాలిక్యులేష‌న్‌కు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. దీనికి కంట్రోల్‌, ఆల్ట్‌, ఎఫ్ 9 ఒకేసారి ప్రెస్ చేయాలి.

రిబ్బ‌న్స్ అండ్ మెనూస్ (ఎఫ్ 10)
మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఎఫ్ 10 కీని ట్యాప్ చేస్తే ఇది రిబ్బ‌న్‌ని మానిప్యులేట్ చేస్తుంది. సెల‌క్టింగ్ ఫాంట్స్‌, ఇన్స‌ర్టింగ్ ఇమేజెస్ లైవ్ లాంటి టూల్స్‌ని ఆప‌రేట్ చేయ‌డానికి రిబ్బ‌న్ యూజ్ అవుతుంది. అంతేకాదు ఎఫ్ 10 ప్రెస్ చేయ‌డం ద్వారా రిబ్బ‌న్ ఐట‌మ్‌కి కీస్ యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. 

సీ ఇట్ ఆల్ (ఎఫ్ 11)
ఎఫ్ 11ను ఎక్కువ‌గా వెబ్ బ్రౌజ‌ర్లు, వీడియో ప్లేయర్లతో ప‌ని చేసేట‌ప్పుడు వాడ‌తారు. ఈ కీని ప్రెస్ చేస్తే ఎఫ్ 11 మీ ప్రొగ్రామ్‌ని ఫుల్ స్క్రీన్ మోడ్‌లోకి తీసుకొస్తుంది. వీఎల్‌సీ, యూట్యూబ్ లాంటి వాటిలో వీడియోలు చూసేట‌ప్పుడు ఎఫ్ 11 కొడితే చాలు ఫుల్ స్క్రీన్‌లో వీడియోలు తిల‌కించొచ్చు.

సేవ్ యాజ్ (ఎఫ్ 12)
కీ బోర్డులో ఫైన‌ల్ ఫంక్ష‌న్ కీ ఎఫ్ 12. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఈ కీని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. మీ డాక్యుమెంట్, వ‌ర్క్‌బుక్‌, స్లైడ్ ష లాంటి వాటిని భిన్న‌మైన పేర్ల‌తో సేవ్ చేసుకోవ‌డం కోసం సేవ్ యాజ్ ఆప్ష‌న్ యూజ్ చేస్తాం. అంటే ఒక‌సారి సేవ్ చేసి డాక్యుమెంట్‌ని మ‌రో పేరుతో లేదా భిన్న‌మైన లొకేష‌న్ల‌లో సేవ్ చేయ‌డం కోసం ఎఫ్ 12 కొట్టి సేవ్ యాజ్ చేస్తాం. 

జన రంజకమైన వార్తలు