ఆధార్ కార్డు లేకపోతే ఇండియాలో ఏ పనీ నడవదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు అన్నింటికీ ఆధార్‌తోనే లింక్. అందుకే ఇండియాలో 124 కోట్ల మంది ఆధార్ తీసుకున్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఎవరైనా ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు తీసుకోరు ఎందుకంటే చిన్న వయసులో ఉన్న వేలిముద్రలు సరిగా పడవు. అయితే ఇలాంటి 5సంవత్సరాలోపు పిల్లల కోసం యూఐడీఏఐ.. బాల ఆధార్ అనే ప్రత్యేకమైన ఆధార్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని బ్లూ ఆధార్ అని కూడా పిలుస్తున్నారు.
ఎలా తీసుకోవాలి?
1) బాలఆధార్ లేదా బ్లూ ఆధార్ కార్డ్ తీసుకోవాలంటే ముందుగా ఆధార్ అఫీషియల్ వెబ్‌సైట్ uidai.gov.inలోకి వెళ్లాలి.
2) హోం పేజీలోకి వెళ్లి Get Aadhaa అనే లింక్‌ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక కొత్తవిండో ఓపెన్ అవుతుంది. దానిలో Book An Appointment అనే లింక్‌ను క్లిక్ చేయండి.
3) “Book an Appointment at UIDAI run Aadhaar Seva Kendra”లోకి వెళ్లి మీ సిటీ, లొకేషన్ ఎంటర్ చేయండి.
4) ఇప్పుడు Proceed to book Appointment ట్యాబ్‌ను క్లిక్ చేయండి. దీనిలో Baal Aadhaar Card online application అనివస్తుంది. దాన్ని టాప్ చేయండి.
5) ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
6) ఇక్కడ ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ కోసం మీ బిడ్డ డిటెయిల్స్ ఫిల్ చేయండి.
ఆధార్ కేంద్రానికి వెళ్లాలి
* రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అపాయింట్‌మెంట్ డేట్ రోజున బాల ఆధార్ లేదా బ్లూ ఆధార్ తీసుకోవాలంటే దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు మీ చిన్నారిని తీసుకుని వెళ్లాలి.
* మీ బిడ్డ బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి.
* అక్కడ మీ బిడ్డ ఫోటో తీసి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసి వివరాలు నమోదు చేస్తారు.
* తర్వాత మీకు ఒక ఎకనాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు.
* రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఈ ఎస్ఎంఎస్ వచ్చిన 60 రోజుల్లోగా బాల ఆధార్ కార్డు నేరుగా మీ ఇంటికి వస్తుంది.