నికోలాస్ కేజ్... ఈ హాలీవుడ్ స్టార్ ఫొటోలు కొన్ని ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. దీనికి కారణం భిన్నమైన ముఖ కవళికలతో ఒకే ఫొటోను మార్చడం.. దీనికి కారణం డీప్ ఫేక్. అంటే ఒక మనిషి ముఖాన్ని సాంకేతికతను ఉపయోగించి మార్చడమే ఈ డీప్ ఫేక్ ప్రత్యేకత. దీని వల్ల మనం అనుకున్న వాళ్ల ముఖాన్ని వేరే వాళ్ల ముఖంలో పెట్టి వారి ముఖ కవళికలను తీసుకురావొచ్చు. నిజానికి ఇదేం గొప్ప పని కాదు. ఏదో థ్రిల్ ఫీల్ అయ్యే వాళ్ల కోసం.. మరి ఏమిటీ డీఫ్ ఫేక్.. దీని గురించి సవివరంగా చూద్దామా,..
డీప్ లెర్నింగ్
డీఫ్ ఫేక్ అనే పదం డీప్ లెర్నింగ్ నుంచి వచ్చింది. మిషన్ లెర్నింగ్‌లో ఇదో కొత్త కోర్సు లాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో ఇదో భాగం అన్నమాట. కంప్యూటర్ ప్రపంచంలో మన ఊహకు అందనిది. మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయనిది చేసేదే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. డీప్ ఫేక్ అనేది ఇందుకు మంచి ఉదాహరణ. అంటే హ్యుమన్ ఇమేజెస్‌ను వాడుకుని ఫొటోలు, వీడియోలను భిన్నంగా తయారు చేయడమే ఈ టూల్ పని. అంటే వేరే ఎవరో అన్న మాటలను, లేదా చేసిన పనులను మన ఫేస్‌కు ఆపాదించడమే దీని పని. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఫేక్ ఫొటోను, వీడియోను తయారు చేయడమే దీని పని.
ఎలా తయారు చేస్తారంటే..
డీప్ ఫేక్స్ తయారు చేయడానికి నంబర్ ఆఫ్ అప్లికేషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మామూలు వ్యక్తులను కూడా సెలబ్రెటీలుగా మార్చడానికి ఈ డీప్ ఫేక్ తొలిసారి ఉపయోగపడింది. డీపీ ఫేస్ ల్యాబ్ ఈ డీప్ ఫేక్ అప్లికేషన్‌ని తయారు చేసింది. ర్యాడిట్ లాంటి సోషల్ మీడియా సైట్లలో డీప్‌ఫేక్ గురించి ట్యుటోరియల్సే నడుస్తున్నాయి. అయితే ఈ డీప్‌ఫేక్‌ని ఎవరైనా తయారు చేయచ్చని కానీ ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుదని డీపీ ఫేస్ ల్యాబ్ తెలిపింది.