• తాజా వార్తలు

వాట్సాప్ పేమెంట్స్ సెట‌ప్ చేసుకోవ‌డం.. మ‌నీ సెండ్‌, రిసీవ్ చేసుకోవ‌డం ఎలా?



కొవిడ్ భ‌యంతో ఇప్పుడు ఎక్కువ మంది డిజిట‌ల్ పేమెంట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే లాంటివి ఎక్కువ‌గా వాడుతున్నారు. ఇదే బాట‌లో వాట్సాప్ ఇంత‌కు ముందే తీసుకొచ్చిన వాట్సాప్ పేమెంట్స్ కూడా తీసుకొచ్చింది. దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం.

 వాట్సాప్ పేమెంట్స్‌ను సెట‌ప్ చేయ‌డం ఎలా?
స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్న‌ర్‌లో ఉన్న త్రీడాట్స్ మెనూను టాప్ చేయండి.  
* ఆప్ష‌న్ల‌లో పేమెంట్స్‌ను క్లిక్ చేయండి.
* ఇప్పుడు యాడ్ పేమెంట్ మెథ‌డ్ ఆప్ష‌న్ టాప్ చేయండి. 
* మీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఆ అకౌంట్ మీ మొబైల్ నెంబ‌ర్‌తో లింక‌యి ఉండాలి. 
* వెరిఫై ఎస్ఎంఎస్ బ‌ట‌న్ నొక్కి వెరిఫికేష‌న్ పూర్తి చేయండి.
* వెరిఫికేష‌న్ పూర్త‌వ‌గానే మీ బ్యాంక్ అకౌంట్‌తో లింకయి ఉన్న అన్ని అకౌంట్ల‌ను చూపిస్తుంది. మీకు కావాల్సిన అకౌంట్‌ను సెట్ చేసుకోండి. 
* డ‌న్ నొక్కితే మీ అకౌంట్ సెట‌ప్ పూర్త‌వుతుంది. 

వాట్సాప్ పేమెంట్ ద్వారా మ‌నీ సెండ్ చేయడం ఎలా? 
దీనికి రెండు ప‌ద్ధ‌తులున్నాయి. 
మీరు ఎవ‌రికి మ‌నీ సెండ్ చేయాల‌నుకున్నారో వారితో చాట్ ఓపెన్ చేయండి. 
* అటాచ్‌మెంట్స్ ఆప్ష‌న్ క్లిక్ చేసి పేమెంట్ ఆప్ష‌న్ టాప్ చేయండి. 
*ఆ కాంటాక్ట్‌లో ఉన్న‌వ్య‌క్తి వాట్సాప్ పేమెంట్స్ సెట‌ప్ చేసుకున్నారో లేదో చూపిస్తుంది. 
* సెండ్ లేదా రిసీవ్ మ‌నీ అనే స్క్రీన్ వ‌స్తుంది. 
* ఇప్పుడు అమౌంట్ టైప్ చేసి ఓకే నొక్కండి.
* ఇప్పుడ‌ది యూపీఐ పేజీలోకి తీసుకెళుతుంది. మీ యూపీఐ పిన్ ఎంట‌ర్ చేయండి. యూపీఐ పిన్ లేక‌పోతే క్రియేట్ చేసుకోండి.
* యూపీఐ పిన్ ఎంట‌ర్ చేయ‌గానే మీ పేమెంట్ పూర్త‌వుతుంది. 
మ‌నీ రిసీవ్ చేసుకోవాలంటే
రిక్వెస్ట్ మ‌నీని క్లిక్ చేయండి. అవ‌తలి వ్య‌క్తి దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీకు మ‌నీ వ‌స్తుంది.

2వ ప‌ద్ధ‌తి  
వాట్సాప్ ఓపెన్ చేసి త్రీడాట్స్ మెనూలోకి వెళ్లండి.  వాట్సాప్ పేమెంట్స్ ఆప్ష‌న్ క్లిక్ చేయండి.  
* మీ పేరు త‌ర్వాత ఉన్న క్యూఆర్ కోడ్‌ను టాప్ చేయండి
*దీనితో మీరు ఎవ‌రికైనా వాట్సాప్‌లో మ‌నీ సెండ్ చేయాల‌నుకుంటే చేయొచ్చు.  

జన రంజకమైన వార్తలు