• తాజా వార్తలు

కంప్యూటర్ మెయింటెనెన్స్ కి వన్ & ఓన్లీ గైడ్ పార్ట్ -1

మనం కంప్యూటర్ ను గానీ లేదా లాప్ టాప్ ను గానీ వాడేటపుడు దాని మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. కంప్యూటర్ యొక్క స్పీడ్ లో గానీ పెర్ఫార్మెన్స్ లో గానీ ఏ మాత్రం చిన్న కంప్లయింట్ వచ్చినా మనం చాలా అసంతృప్తి కి గురి అవుతాము. కంప్యూటర్ పనితీరులో వచ్చే చిన్న చిన్న లోపాలకే వాటిని అమ్మివేసి కొత్త సిస్టం లను తీసుకోవడం లాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాము. ల్యాప్ ట్యాప్ ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుండడం గమనార్హం. దీనికంతటికీ కారణం దానిని మనం సరిగ్గా మెయిన్టెయిన్ చేయకపోవడమే. మన కంప్యూటర్ ను గానీ ల్యాప్ ట్యాప్ ను గానీ పాడవకుండా ఎలా మెయింటెయిన్ చేసుకోవాలి? తద్వారా మన సిస్టం మరికొంత కాలం పని చేసేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలను గురించిన ఒక పూర్తి స్థాయి గైడ్ ను మొత్తం రెండు భాగాలుగా కంప్యూటర్ విజ్ఞానం అందిస్తుంది. ఇందులో మొదటి భాగాన్ని ఈ రోజు చూద్దాం.

కంప్యూటర్ మెయింటెనెన్స్ కు బేసిక్ టిప్స్

దుమ్ముకు దూరంగా ఉంచండి

మాన్ కంప్యూటర్ యొక్క పనితీరుపై ప్రభావం చూపే అంశాలలో దుమ్ము, ధూళి అనేవి కీలకమైనవి. మీకు చక్కగా మూసివేయబడిన రూమ్ ఉంది అందులో మీ సిస్టం ఉన్నట్లయితే ఇబ్బందేమీ లేదు. అలా కాకుండా మీ కంప్యూటర్ ను ఓపెన్ లేదా దుమ్ము ఎక్కువగా వచ్చే రూమ్ లలో ఉంచి పని చేస్తున్నట్లయితే గనుక దాని గురించి జాగ్రత్తలు తీసుకోవలసిందే. మీ కంప్యూటర్ లోని వివిధ భాగాలనుండి దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అనేది చాలా అవసరం. వెంటిలేషన్ , ఫ్యాన్ కూలింగ్ ఏరియా లలో పని చేయడం మంచిది. దుమ్ము ఎక్కువగా పేరుకుపోవడం వలన కూడా కంప్యూటర్ పెర్ఫార్మన్స్ లో తేడాలు వచ్చే అవకాశం ఉంది.

డెస్క్ టాప్ అయితే ఓపెన్ చేసి క్లీన్ చేయండి

మీరు డెస్క్ ట్యాప్ వాడుతుంటే ఇలా చేయవచ్చు. అది కూడా అసెంబుల్డ్ డెస్క్ ట్యాప్ అయి ఉండాలి. మీ pc యొక్క కాబినెట్ ను ఓపెన్ చేసి వివిధ భాగాలలో ఉన్న దుమ్మును క్లీన్ చేయవచ్చు. RAM స్లాట్ లు,ప్రాసెసర్, మదర్ బోర్డు ఇలా ముఖ్యమైన భాగాలు అన్నింటినీ చెక్ చేసి అక్కడ ఏదైనా దుమ్ము ఉన్నట్లయితే కంప్యూటర్ క్లీనింగ్ కిట్ ను ఉపయోగించి శుభ్రం చేయాలి. చేతితో కానీ మామూలు క్లాత్ తో కానీ క్లీన్ చేయవద్దు.

ఎలక్ట్రిసిటీ సరిగా ఉందో లేదో చూసుకోవాలి

ల్యాప్ ట్యాప్ ఛార్జింగ్ అడాప్టర్ లు పవర్ ఆప్టిమైజేషన్ కు ఇన్ బిల్ట్ ఆప్షన్ లను కలిగి ఉంటాయి. డెస్క్ ట్యాప్ లకు ఇలాంటి సౌలభ్యం ఉండదు. కాబట్టి మన pc ఎక్కువ కాలం పనిచేయాలంటే వైరింగ్ మరియు పవర్ అవుట్ పుట్ లను జాగ్రత్తగా పరిశీలించాలి. సర్జ్ సప్రేసర్ లాంటి ఎక్విప్ మెంట్ వాడడం మంచిది.

మీ pc ని రీఫిటింగ్ చేసుకోండి.

 ఈ సదుపాయం కేవలం అసెంబుల్డ్ డెస్క్ ట్యాప్ యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.మీ కంప్యూటర్ ను సెట్టింగ్ చేసుకోవడం లో ఒక బేసిక్ ఐడియా ను కలిగి ఉండాలి. అప్పుడప్పుడూ HDD, CD డ్రైవ్ మరియు గ్రాఫిక్ కార్డు లను ప్లగ్ అవుట్ చేసి రీఫిట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆయా భాగాలలో దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవాలి.

ల్యాప్ ట్యాప్ లకు కూలర్ స్టాండ్ లను ఉపయోగించండి.

హెవీ పెర్ఫార్మన్స్ టాస్క్ ల కోసం మీరు ల్యాప్ ట్యాప్ లను ఉపయోగిస్తున్నట్లయితే అది ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమస్య మనం లాప్ టాప్ ను డెస్క్ మీద ఉంచిన ప్రతీసారీ ఉంటుంది. ఈ వేడి అనేది లోపల సరిగ్గా సర్క్యులేట్ అవలేదు, బయటకు రాలేదు. ఇలాంటి సందర్భాలలో కూలింగ్ స్టాండ్ లను వాడడం మంచిది. ఈ స్టాండ్ లు USB పవర్డ్ ఫ్యాన్ లను కలిగి ఉంటాయి. ఈ ఫ్యాన్ లు ఎప్పటికప్పుడు మీ ల్యాప్ ట్యాప్ లో ఉత్పత్తి అయిన వేడిని చల్లబరుస్తూ ఉంటాయి. మార్కెట్ లో చాలా తక్కువ ధరలకే మంచి కూలింగ్ ఫ్యాన్ లు అందుబాటులో ఉన్నాయి.

ఎక్స్ టర్నల్ కీ బోర్డు లను ఉపయోగించేటపుడు జాగ్రత్తగా ఉండాలి.

లాప్ ట్యాప్ లను ఉపయోగించేతపుడు మన సౌకర్యం కోసం ఎక్స్ టర్నల్ కీ బోర్డు లను ఉపయోగిస్తూ ఉంటాము. వీటిని వాడడం మంచిదే. కానీ లాప్ ట్యాప్ లో ఉండే ఒరిజినల్ కీ బోర్డు ను కూడా అప్పుడప్పుడూ ఉపయోగిస్తూ ఉండాలి. లేకపోతే వాటిలోనికి దుమ్ము పేరుకు పోయి స్త్రుచ్క్ అయ్యే అవకాశం ఉంటుంది.

మీ సాఫ్ట్వేర్ ను అప్ డేట్ చేసుకోండి.

 ఎప్పుడూ లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్ వేర్ లనే వాడాలి.  అలా అని పైరేటెడ్ వెర్షన్ సాఫ్ట్ వేర్ లను అసలు ఉపయోగించకూడదు. రెగ్యులర్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు అనేవి మాల్ వేర్ అటాక్ ల లాంటి అనేక సమస్యల నుండి మీ సిస్టం ను కాపాడతాయి.

సాఫ్ట్ వేర్ ప్రోడక్ట్ లను రిజిస్టర్ చేసి ఉపయోగించండి.

మీ pc ని సెక్యూర్ గా ఉండడం లో ఇది మరొక ముఖ్యమైన అంశం. హార్డ్ వేర్ ప్రోడక్ట్ లను కూడా మీరు రిజిస్టర్ చేసి ఉపయోగించవచ్చు. దీనివలన వారంటీ,కస్టమర్ సపోర్ట్ లాంటి బెనిఫిట్స్ సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలు ఉంటుంది. పైరేటెడ్ వెర్షన్ లను ఉపయోగించే వీలు కూడా ఉండదు.

డేటా ను బ్యాక్ అప్ చేయాలి

వాస్తవానికి ఇది కంప్యూటర్ మెయింటెనెన్స్ కు సంబందించిన టిప్ కాదు. అయినప్పటికీ మాన్ pc లలోని డేటా ను ఎప్పటికప్పుడు బ్యాక్ తీసుకోవడం మంచిది. pc లకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితులలో మన డేటా సురక్షం గా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు బ్యాక్ తెసుకోవడమే ఉత్తమం.

యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించండి.

మీరు విండోస్ 10 ను ఉపయోగిస్తుంటే మీకు రెండు ఆప్షన్ లు ఉన్నాయి. దీనితో డిఫాల్ట్ గా వచ్చే డిఫెండర్ అనే యాంటి వైరస్ ను ఉపయోగించవచ్చు. లేదా ఏదైనా థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ ను కూడా ఉపయోగించవచ్చు. బిట్ డిఫెండర్ , నార్టన్,కాస్పెర్ స్కై,అవాస్ట్ లాంటి డెవెలపర్ లకు చెందిన సాఫ్ట్ వేర్ లను ఉపయోగించవచ్చు. ఇవి మీ కంప్యూటర్ ను ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ప్రమాదాల నుండి కాపాడతాయి.

యాంటి వైరస్ స్కాన్ లను చేయాలి

 కేవలం యాంటి వైరస్ లను ఇన్ స్టాల్ చేయడమే కాక ఎప్పటికప్పుడు వాటిని ఉపయోగించి మీ pc ని ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉండాలి. దీనివలన మీ pc లోనికి ఏదైనా జంక్ ఫైల్ లు, మల వేర్ లు వచ్చాయేమో తెలుసుకుని వాటిని రిమూవ్ చేసే వీలు ఉంటుంది.

విండోస్ అప్ డేట్ లను ఇన్ స్టాల్ చేసుకోండి

విండోస్ డెస్క్ ట్యాప్ లను గానీ లాప్ టాప్ లను కానీ వాడే వారికీ టం pc లను సురక్షంగా ఉంచుకోవడానికి ఇది మరొక మంచి మార్గం. అయితే మీరు విండోస్ యొక్క జెన్యూన్ వెర్షన్ లను ఉపయోగిస్తూ ఉండాలి. ఈ అప్ డేట్ లు ఎక్కువ డేటా ను ,స్పేస్ ను ఆక్రమిస్తాయి. అయినప్పటికీ మీ కంప్యూటర్ ను మరింత స్పీడ్ గానూ, సెక్యూర్ గానూ ఉంచుతాయి.   

జన రంజకమైన వార్తలు