• తాజా వార్తలు

ఆధార్‌ పీవీసీ కార్డ్ పొంద‌డానికి సింపుల్ గైడ్

ఆధార్ కార్డ్ ఇండియాలో అన్నింటికీ అవ‌స‌ర‌మే. ఓటు హ‌క్కు నుంచి ఆస్తుల రిజిస్ట్రేష‌న్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్ కార్డ్ కావాలి. దీన్ని జేబులో పెట్టుకునేంత చిన్న‌గా త‌యారుచేస్తోంది  యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ).  ఆధార్ కార్డును ఏటీఎం కార్డు సైజులో ఉన్న పీవీసీ కార్డ్ రూపంలో అందిస్తుంది.   ఈ కార్డును పొందటానికి ఆధార్ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకున్న‌‌ మొబైల్‌ నెంబర్ కూడా అక్క‌ర్లేదు.  ఓటీపీ కోసం ఏ మొబైల్ నెంబర్‌నైనా వాడవచ్చని యూఐడీఏఐ తాజాగా ప్ర‌క‌టించింది. 

వీవీసీ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
* యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి  
* 'మై ఆధార్'  ఆప్షన్ క‌నిపిస్తుంది. దీన్నిక్లిక్‌ చేస్తే అర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. 
* ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్  చేయండి 
* సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డుకు లింక్ చేసిన  మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ నెంబ‌ర్ అందుబాటులో లేక‌పోతే మీరు మీ ద‌గ్గ‌రున్న మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయొచ్చు.  
* ఓటీపీ ఎంటర్ చేశాక అది పేమెంట్ గేట్‌వేలోకి వెళ్తుంది. 
* ఇంటర్‌నెట్ బ్యాంకింగ్,  డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా 50 రూపాయలు చెల్లించాలి. 
* మీ కొత్త పీవీసీ ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్‌లో కొన్ని రోజుల్లో మీ ఇంటికే వస్తుంది. 
*  ఈ ఆధార్ కార్డు స్టేటస్ ట్రాక్ చేయ‌డానికి యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. 'మై ఆధార్' అని క్లిక్ చేసి, 'చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్' అని ఎంచుకుంటే మీ ఆధార్ మీ చేతుల్లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు.
* ఈ సేవా కేంద్రాల్లో అయినా ఈ కార్డును పొందవచ్చు.

జన రంజకమైన వార్తలు