మనం ఎవరితోనైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకున్నపుడు కానీ లేదా మాట్లాడుతూ ఉన్నపుడు కానీ ఫోన్ మధ్యలో కట్ అయిపోతుంది కారణం చూస్తే టాక్ టైం అయిపోతుంది, అలాగే ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నపుడు కూడా ఈ డేటా బాలన్స్ సడన్ గా అయిపోవడం వలన మధ్యలోనే ఆగిపోతుంది. సమయానికి దగ్గరలో రీఛార్జి స్టోర్ కూడా ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా అప్పటికప్పుడు రీఛార్జి చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాలు దాదాపుగా అందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయి ఉంటాయి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! ఇలాంటి సమయాలలోనే టాక్ టైం లోన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం టాక్ టైం మాత్రమే కాదు డేటా ను కూడా లోన్ తీసుకోవచ్చు. వివిధ కంపెనీలు అందిస్తున్న టాక్ టైం మరియు డేటా లోన్ ల గురించి ఈ రోజు ఆర్టికల్ లో మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం ఇవ్వనున్నాం. మరెందుకు ఆలస్యం చదివేయండి.
వోడాఫోన్ లోన్ ఆఫర్
- టాక్ టైం లోన్ కోసం *111*1*3# కు గానీ 12411 కు గానీ డయల్ చేయాలి. లేదా CREDIT అను టైపు చేసి 144 కి sms చేయాలి.
- sms చేసినపుడు కన్ఫాం చేయడానికి 1 తో రిప్లై ఇస్తే మీకు రూ 5/- ల టాక్ టైం లభిస్తుంది. తర్వాతి రీఛార్జి లో రూ 6/- కట్ అవుతుంది.
- ఇంటర్ నెట్ లోన్ కోసం *111*1*3# కు డయల్ చేయాలి లేదా ICREDIT అని టైప్ చేసి 144 కి sms చేసి, కన్ఫాం చేయడానికి 2 తో రిప్లై ఇవ్వాలి. మీకు ఒక రోజు వ్యాలిడిటీ తో 30 MB 3 జి డేటా లభిస్తుంది. మీ తర్వాతి రీఛార్జి లో రూ 10/- లి కట్ అవుతుంది.
ఎయిర్ టెల్ లోన్ నెంబర్
- టాక్ టైం కోసం *141*10 కి గానీ 52141కు గానీ డయల్ చేయాలి. రూ 10/- ల టాక్ టైం లభిస్తుంది.
- ఇంటర్ నెట్ లోన్ కోసం *141*567# కు డయల్ చేస్తే ఒక రోజు వ్యాలిడిటీ తో 30 MB 3 జి డేటా లభిస్తుంది.
- వీటికి గానూ తర్వాతి రీఛార్జి లో రూ15/- కట్ అవుతుంది.
ఐడియా లోన్ నెంబర్
- ఐడియా లో మీరు కొత్త సిమ్ తీసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే లోన్ ఆఫర్ ను పొందడానికి అవకాశం ఉంటుంది.
- టాక్ టైం కోసం వివిధ రకాల నెంబర్ లు ఉన్నాయి. *150*10# కు దిల్ చేసినా లేదా CREDIT అని టైపు చేసి 144 కి sms చేసినా మీకు రూ 10/- ల టాక్ టైం లభిస్తుంది.
- *150*20# కు డయల్ చేస్తే రూ 20/- ల టాక్ టైం , *165*5# కు డయల్ చేస్తే రూ 5/- టాక్ టైం అలాగే *444# కు డయల్ చేస్తే రూ 4/- టాక్ టైం లభిస్తాయి.
- ఇంటర్ నెట్ లోన్ కోసం *150*06# కు డయల్ చేస్తే 25MB 2 జి డేటా వస్తుంది, తర్వాతి రీఛార్జి లో రూ6/-లు కట్ అవుతుంది.
- *150*333# కు డయల్ చేస్తే 35MB 3 జి డేటా లభిస్తుంది, తర్వాతి రీఛార్జి లో రూ 11/- లు కట్ అవుతుంది.
జియో లోన్ నెంబర్
- ప్రస్తుతం జియో ఏ విధమైన లోన్ ఆఫర్ లు ఇవ్వడం లేదు.
ఎయిర్ సెల్ లోన్ నెంబర్
- టాక్ టైం కోసం *414# కు గానీ 12880 కు డయల్ చేసినా లేదా LOAN అని టైపు చేసి 55414 కు sms చేసినా మీకు రూ 10/- ల టాక్ టైం లభిస్తుంది.
- తర్వాతి రీఛార్జి లో రూ 12/- లు కట్ అవుతుంది.
డోకోమో లోన్ నెంబర్
- *444# కు గానీ *369# కు గానీ డయల్ చేసి మీ అవసరాన్ని బాతి అనువైన ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
రిలయన్స్ లోన్ నెంబర్
- *141*5# కు డయల్ చేస్తే రూ5/- ల టాక్ టైం మరియు *141*10#కు డయల్ చేస్తే రూ 10/- ల టాక్ టైం లభిస్తాయి.
నోట్ :- BSNL, టెలినార్ మరియు జియో నెట్ వర్క్ లు ఇంకా ఏ విధమైన లోన్ నెంబర్ లను ప్రవేశపెట్టలేదు.