• తాజా వార్తలు

మనందరికీ దగ్గర ఎల్లప్పుడూ ఉండాల్సిన గవర్నమెంట్ యాప్స్, నెంబర్స్ కి కంప్లీట్ గైడ్

డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చాలా కృషిచేస్తోంది. దేశం అభివృద్థి చెందడానికి కీలకంగా భావిస్తున్న ఈ క్రాంతి, ఈ గవర్నెన్స్ , మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ వంటి ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది.  డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రభుత్వం పలు యాప్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో 35  ప్రభుత్వ యాప్స్‌ తప్పసరిగా ప్రతి ఒక్క భారతీయుడు తప్పనిసరిగా ఎల్లప్పుడూ వీటిని వాడాలి. ఆ యాప్స్ ఏంటో ఓసారి చూద్దాం..
1. భారత్ కే వీర్....
విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవానుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ....భారత హోం మంత్రిత్వ శాక భారత్ కే వీర్...అనే యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా అమర జవానుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే వీలుగా దీన్ని రూపొందించారు. 
2. సి విజిల్....
ఈ యాప్ భారత ఎన్నికల సంఘం రూపొందించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా..జరిగినా...సామాజిక బాధ్యత కలిని ప్రతీ పౌరుడు ఈసీ ద్రుష్టికి తీసుకెళ్లెలా సివిజిల్ యాప్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్.
3.యుటిఎస్....
రైళ్ళలో జనరల్‌ టిక్కెట్లను కూడా ఆన్‌లైన్‌లో పొందేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే యుటిఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణం రోజున ఈ యాప్ నుంచే మొబైల్‌ ద్వారా టిక్కెట్‌ పొందవచ్చు
4. ఎంపాస్‌పోర్టు...
ఈ యాప్ ద్వారా  పాస్‌పోర్టు అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాకింగ్‌, పాస్‌పోర్టు సేవ కేంద్ర లొకేషన్‌ వంటి పలు సేవలను వినియోగించుకోవచ్చు. 
5. 1091 ఉమెన్ హెల్ప్ లైన్...
మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన నెంబర్ ఇది. ఈ నెంబర్ ద్వారా మహిళలు తమ సమస్యలను ప్రభుత్వ ద్రుష్టికి తీసుకెళ్లవచ్చు. 
6.3618001201740 — భీమ్, యూపిఐ...
యూపీఐ పేమెంట్‌ అడ్రస్‌లను, ఫోన్‌ నెంబర్లను, క్యూఆర్‌ కోడ్‌లను వాడుతూ నగదును పంపించడానికి, పొందడానికి యూజర్లకు ఈ యాప్‌ సహకరిస్తుంది. అన్ని దిగ్గజ భారతీయ బ్యాంకులు యూపీఐతో లింక్‌ అయి ఉన్నాయని, దీంతో ఈ లావాదేవీలు కుదురుతున్నాయి. ఈ సర్వీసు 24గంటలు పనిచేస్తుంది. 
7. ఆయ్‌కార్‌ సేథు...
ఆదాయపు పన్ను విభాగానికి చెందిన అన్ని రకాల సర్వీసులను అందజేసేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లోనే పన్నులు చెల్లించడం, ఆన్‌లైన్‌ పాన్‌ దరఖాస్తు చేసుకోవడం, పన్ను కాల్యుకేటర్‌కు ఇది ఎంతో సహకరిస్తుంది.
8. 108 నేషనల్ డిజాస్టర్ యాప్....
భూకంపాలు, వరదలు వంటి విపత్తులు వచ్చిన సమయంలో బాధితులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ యాప్ ను రూపొందించారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. 
9. ఈ-పాఠశాల యాప్‌ ...
 ఎన్‌సీఈఆర్‌టీ ఈ-బుక్స్‌ను ఈ యాప్‌ ఆఫర్‌ చేస్తుంది. హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ, ఎన్‌సీఈఆర్‌టీ కలిసి ఈ యాప్‌ను రూపొందించాయి. మొబైల్‌ ఫోన్‌లోనే విద్యార్థులకు, టీచర్లకు ఈ-బుక్స్‌ను అందిస్తుంది.
10.ఎంకవాచ్‌(మొబైల్‌ సెక్యురిటీ సొల్యుషన్స్‌) ...
 మొబైల్‌ ఫోన్లకు చెందిన ప్రమాదాలను గుర్తించడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.
11. స్టార్టప్‌ ఇండియా...
స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను అర్థం చేసుకోవడానికి, సమాచారాన్ని పొందడానికి ఈ యాప్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను తెలుసుకోవచ్చు. 
12. ఉమాంగ్‌ యాప్‌ ...
అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్‌మెంట్లను, వాటి సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకు రావడంతో ఈ యాప్‌ ఎంతో కీలకం. ఆధార్‌, డిజిలాకర్‌, పేగవర్న్‌మెంట్‌ వంటి సర్వీసులను ఇది అందజేస్తుంది.
13. ఇంక్రిడెబుల్‌ ఇండియా యాప్‌...
 ఇది ప్రభుత్వ టూరిజం యాప్‌. టూర్‌ ఆపరేటర్లు, రిజిస్ట్రేషన్‌ సర్వీసు ప్రొవైడర్లు వంటి వారి వివరాలను అందిస్తుంది.
14. ఎంపాస్‌పోర్టు...
పాస్‌పోర్టు అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాకింగ్‌, పాస్‌పోర్టు సేవ కేంద్ర లొకేషన్‌ వంటి పలు సేవలను ఈ యాప్‌ ఆఫర్‌ చేస్తుంది.
15. ఎంఆధార్‌ యాప్‌..
 ఎంఆధార్‌ యాప్‌ అనేది మరో ఉపయోగకర యాప్‌. ఇది కేవలం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్‌ గుర్తింపును స్మార్ట్‌ఫోన్లలో తీసుకెళ్లడానికి ఈ యాప్‌ సహకరిస్తుంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆధార్‌ ప్రొఫైల్‌ను షేర్‌ చేయవచ్చు, చూసుకోవచ్చు. 
16. భీమ్‌...
 యూపీఐ పేమెంట్‌ అడ్రస్‌లను, ఫోన్‌ నెంబర్లను, క్యూఆర్‌ కోడ్‌లను వాడుతూ నగదును పంపించడానికి, పొందడానికి యూజర్లకు ఈ యాప్‌ సహకరిస్తుంది. అన్ని దిగ్గజ భారతీయ బ్యాంకులు యూపీఐతో లింక్‌ అయి ఉన్నాయని, దీంతో ఈ లావాదేవీలు కుదురుతున్నాయి. 

జన రంజకమైన వార్తలు