• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ మెసేజ్‌ల‌ను బ్లాక్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 3 సంవత్సరాల క్రితం /

స్పామ్ మెసేజ్‌లు.. సెల్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ స‌మ‌స్యే. అవ‌స‌రంలేని ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ మ‌న ఫోన్‌కు వ‌చ్చేస్తుంటే చాలా చికాగ్గా ఉంటుంది. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

1) ఆప్ట్ అవుట్ చేయండి
చాలా కంపెనీలు స్పామ్ మెసేజ్‌లు పంపినప్పుడు కింద ఆప్ట్ అవుట్ దీజ్ మెసేజ‌స్ అనే ఆప్ష‌న్ ఇస్తాయి. ఆప్ట్ అవుట్ చేస్తే ఆ మెసేజ్‌లు ఇక‌రావు. ఒక‌వేళ అలాంటి ఆప్ష‌న్ గ‌నుక లేక‌పోతే దాన్ని క‌ద‌ప‌కండి. ఎందుకంటే అవి మాల్‌వేర్ మెసేజ్‌ల‌య్యే ప్ర‌మాదం ఉంది.

2) నంబ‌ర్ బ్లాక్ చేయండి
త‌ర‌చూ మీకు స్పామ్ మెసేజ్‌లు పంపిస్తున్న నెంబ‌ర్ల‌కు బ్లాక్ చేయండి. దీంతో మీకు ఆ మెసేజ్‌లు ఇక‌పై రావు.

3)డూ నాట్ డిస్ట్ర‌బ్‌ను యాక్టివేట్ చేసుకోండి
డూ నాట్ డిస్ట్ర‌బ్ అనే ఫీచ‌ర్ ఉంటుంది. దీనికి డీఎన్‌డీ అనే మెసేజ్ పంపితే ఇలాంటి మెసేజ్‌లు రాకుండా మీ మొబైల్ నెట్‌వ‌ర్క్ కంపెనీలు చ‌ర్య‌లు తీసుకుంటాయి.

4)1909కి కంప్ల‌యింట్ చేయండి
మీకు తెలియ‌న్ నంబ‌ర్ల నుంచి స్పామ్ మెసేజ్‌లు వ‌స్తుంటాయి. అలాంట‌ప్పుడు 1909 నెంబ‌ర్‌కు కాల్ చేసి ఆ మెసేజ్ ఏ నెంబ‌ర్ నుంచి వస్తుంది, డేట్‌, టైమ్‌, మెసేజ్ సారాంశాన్ని చెప్పి కంప్ల‌యింట్ రిజిస్ట‌ర్  చేయండి. మీకు ఒక కంప్ల‌యింట్ నెంబ‌ర్ వ‌స్తుంది.  ఆ త‌ర్వాత కూడా అలాంటి మెసేజ్‌లు వ‌స్తే కంప్ల‌యింట్ నంబ‌ర్ చెప్పి వాటిని బ్లాక్ చేయ‌మ‌ని కోర‌వ‌చ్చు.

 

జన రంజకమైన వార్తలు