• తాజా వార్తలు

వాట్సాప్ అకౌంట్‌ను ప‌ర్మినెంట్‌గా డిలీట్ చేయడం, డేటాను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ విష‌యంలో ప‌ట్టు వీడ‌టం లేదు. త‌మ ప్రైవ‌సీ పాల‌సీని యాక్సెప్ట్ చేయ‌క‌పోతే వినియోగ‌దారులు మెసేజ్‌లు పంప‌లేర‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చెప్ప‌డంతో డేట్ వాయిదా వేసింది త‌ప్ప త‌మ మాట మార్చుకోలేదు. ఇప్పుడు తాజాగా మే నెల వ‌ర‌కు గ‌డ‌వు పొడిగించింది. అంటే ఆ త‌ర్వాత ప్రైవ‌సీ పాల‌సీని యాక్సెప్ట్ చేయ‌క‌పోతే మీరు దాని ద్వారా మెసేజ్‌లు పంపుకోలేరు.  పోనీ యాక్సెప్ట్ చేస్తే మీ చాట్స్‌, మీ ప‌ర్స‌న‌ల్ డేటా ఫేస్బుక్ లో షేర్ అయ్యే ప్ర‌మాద‌ముంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో చాలా మంది వాట్సాప్‌ను వ‌దిలేసి వేరే యాప్‌ల వైపు చూస్తున్నారు.  టెలిగ్రామ్‌, సందేశ్ యాప్‌ల‌ను చాలామంది ఇప్ప‌టికే వాడుతున్నారు. అయితే వాట్సాప్‌ను వాడ‌టం మానేస్తే ఆ యాప్‌ను డిలీట్ చేస్తే స‌రిపోదు. అందులో ఉన్న మీ డేటాను మొత్తం తీసేయాలి. ఇందుకోసం ఏం చేయాలో చూద్దాం.


వాట్సాప్ నుంచి మీ డేటా మొత్తాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? 

* మీ డేటా మొత్తాన్ని ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ అనుమతించదు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇప్పటికే మీ స్మార్ట్ ఫోన్‌లో సేవ్ అయి ఉంటాయి,. కాబ‌ట్టి వాటి గురించి వ‌దిలేయండి. 
* ఇక వాట్సాప్‌లో మీ చాట్‌ల‌ను ఎలా సేవ్ చేసుకోవాలిఓ చూడండి. అయితే ఈ ఫ్లాట్ ఫాంలో 'డౌన్ లోడ్ ఆల్ ఎట్ ఒన్స్స ఆప్ష‌న్ లేదు.  కాబట్టి ఒక్కొక్కటి డౌన్‌లోడ్  చేసుకుంటూ వెళ్లాలి.
* ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. చాట్స్ క్లిక్ చేసి, చాట్ హిస్టరీలోకి వెళ్లండి. 
* ఎక్స్‌పోర్ట్ చాట్  ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మల్టీ మీడియా కంటెంట్ ను ఎక్స్ పోర్ట్ చేయాలనుకుంటే ఇంక్లూడ్ మీడియా అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. 
* ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఇతర చాట్‌లు కూడా ఎక్స్‌పోర్ట్ చేయాలంటే మ‌ళ్లీ సేమ్ ఇదే స్టెప్స్ ఫాలో అవ్వాలి.  
* ఇలా మీ డేటా, చాట్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకున్నాక అప్పుడు వాట్సాప్ అకౌంట్‌ను ప‌ర్మినెంట్‌గా డిలీట్ చేసుకోవాలి.


వాట్సాప్ ఖాతా శాశ్వతంగా తొలగించాలంటే..
* ఇక మీ వాట్సాప్ ఖాతా శాశ్వతంగా డిలీట్ చేయడానికి ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
* అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
* ఇప్పుడు డిలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. 
* ఇప్పుడు వాట్సాప్‌లో రిజిస్ట‌ర్ చేసిన మీ మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి. 
*  డిలీట్ మై అకౌంట్ బటన్ క్లిక్ చేయండి. 
* అంతే మీ వాట్సాప్ ఖాతా శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది.

జన రంజకమైన వార్తలు