ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి విషయం గుర్తు పెట్టుకునేంత పరిస్థితి ఉండడం లేదు. ఫ్రెండ్ బర్త్‌డే కావచ్చు, రిలేటివ్స్ పెళ్లి రోజు కావచ్చు. లేదా తప్పనిసరిగా వెళ్లాల్సిన ఫంక్షన్ కావచ్చు. లేదంటే ఫలానా డేట్‌కల్లా తప్పనిసరిగా చేయాల్సిన పని కావచ్చు. బిజీ లైఫ్‌లో పడి వాటిని మరిచిపోయే అవకాశాలే ఎక్కువ. దీనికి పరిష్కారం విండోస్ స్టికీ నోట్స్. దీన్ని జస్ట్ ఓపెన్ చేసి నోట్ చేసుకుంటే చాలు మనకు రిమైండ్ అవుతుంది. అయితే ఆఫీస్ పీసీలో స్టికీ నోట్స్ పెట్టుకుంటే బయట ఉన్నప్పుడు చూడడం ఎలా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
పీసీలో ఇలా..
విండోస్ స్టికీ నోట్స్ వెర్షన్‌లో ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఇది విండోస్ 7, 8, 8.1, 10 ఓఎస్‌లున్న పీసీల్లో పని చేస్తుంది. విండోస్ 10 కంప్యూటర్లలో క్లౌడ్ సింక్రనైజేషన్ ఫీచర్ ఉంది. అంటే మీ పీసీలో స్టికీ నోట్స్ పెట్టుకుంటే దాన్ని విండోస్ 10తో నడుస్తున్న ఏ కంప్యూటర్‌లోనయినా యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు ఆండ్రాయిడ్ మొబైల్‌లో కూడా ఈ స్టికీ నోట్స్ చూసుకోవచ్చు. అయితే ఐవోఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో లేదు.
ఎలాంటి కంప్యూటర్‌లో అయినా వాడుకోవచ్చు
మీరు విండోస్ కంప్యూటర్, మాక్, లినక్స్ ఎలాంటి ఓఎస్ ఉన్న కంప్యూటర్లోనయినా స్టికీ నోట్స్ వాడుకోవచ్చు. అయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ మెయిల్ ఐడీతో ఓపెన్ చేసి నోట్స్‌ను మాన్యువల్‌గా స్రింకనైజ్ చేయొచ్చు. ఆ తర్వాత వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇలా..
ఆండ్రాయిడ్ మొబైల్‌లో కూడా విండోస్ స్టికీ నోట్స్ పొందవచ్చు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్, ఆ తర్వాత వచ్చిన ఓఎస్‌లతో నడిచే ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో అయినా విండోస్ స్టికీ నోట్స్ పొందే అవకాశం ఉంది.
* మీరు మైక్రోసాఫ్ట్ లాంచర్‌ను ఆండ్రాయిడ్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేయాలి. ఇందుకోసం మీ మైక్రోసాఫ్ట్ లాగిన్, పాస్‌వర్డ్‌తో ఓపెన్ చేయాలి.
* లాంచర్ డౌన్‌లోడ్ చేశాక విండోస్ స్టికీ నోట్స్‌లాంటి మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ చాలా అందుబాటులోకి వస్తాయి.
* లాంచర్‌ను లెఫ్ట్ నుంచి రైట్‌కు స్వైప్ చేస్తే గ్లాన్స్, న్యూస్, టైమ్ లైన్ వంటి డిఫరెంట్ ట్యాబ్స్ కనిపిస్తాయి.
* గ్లాన్స్ (Glance) ట్యాబ్‌లో మీకు స్టికీ నోట్స్ సెక్షన్ కనిపిస్తుంది. దీన్ని అనేబుల్ చేసుకోవాలి.
* ఇప్పుడు మీరు నోట్స్ రాసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.
* ఈ నోట్స్‌ను విండోస్ 10 ఓఎస్‌తో నడిచే ఏ సిస్టంలోనయినా యాక్సెస్ చేసుకోవచ్చు.