• తాజా వార్తలు

టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

టిక్‌టాక్ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఫేస్బుక్ కంటే ఫేమస్ ఐన సోషల్ మీడియా యాప్ ఇది. అయితే టిక్‌టాక్‌లో వీడియోలను మొబైల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. పీసీలో చూసే అవకాశం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? మీకోసమే టిక్‌టాక్ పీసీ యాప్ వచ్చేసింది. ఇంకెందుకు ఆల‌స్యం మీ ఫేవ‌రెట్ టిక్‌టాక్ వీడియోల‌ను పీసీలో పెద్ద స్క్రీన్‌మీద చూసి ఆనందించండి మ‌రి..

ఏమిటీ టిక్‌టాక్  పీసీ యాప్?
* టిక్‌టాక్ పీసీ యాప్ మొబైల్ యాప్‌కి పీసీ వెర్షన్.

* tiktok.com అని బ్రౌజర్లో టైపు చేస్తే టిక్‌టాక్  పీసీ యాప్ వ‌స్తుంది.

* యాప్ రైట్  సైడ్ పైభాగంలో watch now అని రెడ్ కలర్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్  చేస్తే టిక్‌టాక్  పీసీ యాప్ ఓపెన్ అవుతుంది.

* హోం పేజీలో ట్రెండింగ్, డిస్కవర్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి .

* ట్రెండింగ్ క్లిక్ చేస్తే టిక్ టాక్  ట్రెండింగ్ వీడియోలను చూడొచ్చు.

* డిస్కవర్ ఆప్షన్ క్లిక్ చెస్తే మరిన్ని వీడియోలు కనిపిస్తాయి.

మీకు కావాల్సిన టిక్‌టాక్ వీడియోలు చూడాలంటే
మొబైల్ టిక్ టాక్ యాప్ కంటే దీనిలో ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి. అయితే ఎవరైనా స్పెసిఫిక్ యూజర్ వీడియోలు చూడాలంటే tiktok.com/tag/ అని టైపు చేసి పక్కన యూజర్ నేమ్ టైపు చేయాలి. అప్పుడు మీకు కావాల్సిన యూజర్ వీడియోలు వస్తాయి.

 

జన రంజకమైన వార్తలు