• తాజా వార్తలు

టిక్‌టాక్‌ వీడియోలను పీసీలో అప్‌లోడ్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

నిన్నటి ఆర్టికల్‌లో టిక్‌టాక్‌ పీసీ యాప్ గురించి తెలుసుకున్నాం. పీసీలో టిక్‌టాక్‌ వీడియోలను ఎలా చూడాలి ? కావాల్సిన వీడియోలను ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. పీసీ యాప్‌లో టిక్‌టాక్‌ వీడియోలను అప్‌లోడ్‌ కూడా చేయొచ్చు. అదెలాగో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం

అప్‌లోడ్ చేద్దాం రండి
టిక్‌టాక్ పీసీ వెర్ష‌న్‌లో కూడా వీడియోల‌ను అప్‌లోడ్ చేయొచ్చు. ఇది సేమ్ మొబైల్‌లో టిక్‌టాక్ వీడియోలు అప్‌లోడ్ చేసిన‌ట్లే ఉంటుంది.

* TikTok.com అని సెర్చ్ చేసి Watch Nowను క్లిక్ చేయండి.  

* ట్రెండింగ్‌, డిస్క‌వ‌ర్ బ‌ట‌న్‌ల ప‌క్క‌నే అప్‌లోడ్ అని అప్ యారో సింబ‌ల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.

* లాగిన్ ఆప్ష‌న్ వ‌స్తుంది.  గ‌తంలో మీరు దేనితో లాగిన్ చేశారో అంటే మొబైల్ నెంబ‌ర్ జీమెయిల్ ఐడీ, ఫేస్‌బుక్ ఐడీ ఇలా దేనితో చేశారో దాన్ని ఎంట‌ర్ చేయండి.

*సైన్ ఇన్ అయ్యాక అప్‌లోడ్ వీడియో ఆప్ష‌న్ వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేయండి. మీ పీసీలో ఉన్న వీడియోను అప్‌లోడ్ చేయ‌డానికి బ్రౌజ్ చేయండి. కావాల్సిన వీడియో దగ్గ‌ర‌కు వ‌చ్చాక దాన్ని డ‌బుల్ క్లిక్ చేసి  అప్‌లోడ్  చేయండి.

అప్‌లోడ్ రూల్స్ తెలుసా?
* టిక్‌టాక్ పీసీ వెర్ష‌న్‌లో అప్‌లోడ్ చేయాలంటే ఆ వీడియో 60 సెక‌న్ల‌లోపే ఉండాలి.

* రిజ‌ల్యూష‌న్ 720×1280 అంత‌కంటే ఎక్కువ ఉండాలి.

* పోట్రెయిడ్ మోడ్‌లో షూట్ చేసిన వీడియో బాగా ప‌నికొస్తుంది. ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో షూట్ చేసింది కూడా వాడుకోవ‌చ్చు.  అయితే ఇలాంటి వీడియోల‌కు కింద బ్లాక్ క‌ల‌ర్ బార్‌లాంటిది క‌నిపిస్తుంది. చూడ్డానికి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది.  

ప్రైవ‌సీ సెట్టింగ్స్ మీ చేతుల్లోనే
వీడియో అప్‌లోడ్ అయ్యాక క్యాప్ష‌న్‌,  హాష్‌ట్యాగ్స్‌, టాగ్ యూజ‌ర్స్ అన్నీ సెట్ చేసుకోవ‌చ్చు.
* మీ వీడియోలు ఎవ‌రెవ‌రు చూడొచ్చో సెట్ చేసుకునే ఆప్ష‌న్ ఉంది.
* అలాగే వీడియోలు చూసిన‌వారు కామెంట్ చేయొచ్చో లేదో కూడా మీ ఆప్ష‌నే.

 

జన రంజకమైన వార్తలు