లోన్ కోసం అప్లయి చేస్తే మీ క్రెడిట్ స్కోర్ అడుగుతాయి కంపెనీలు. క్రెడిట్ రిపోర్ట్ కూడా తీసుకుంటాయి. అయితే అవన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఎంత చదువుకున్నవాళ్లకయినా అందులో ఉన్న కొన్ని పదాలు అర్ధం కావు. అందుకే మీ క్రెడిట్ నివేదిక, స్కోర్‌ను పైసాబజార్ డాట్‌కామ్ ప్రాంతీయ భాషల్లో అందించడానికి ఏర్పాట్లు చేసింది.
ఏయే భాషల్లో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు ప్రజలకు వారి ప్రాంతీయ భాషల్లో క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ అందిస్తున్నట్లు పైసాబజార్ సీఈవో నవీన్ కుక్రేజా ప్రకటించారు. ఇందుకోసం తెలుగు, కన్నడ, మరాఠీల్లో క్రెడిట్ నివేదికలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గతేడాది డిసెంబర్లోనే దీని కోసం పైసాబజార్ సన్నాహాలు ప్రారంభించింది. మొదట హిందీలో క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వడాన్ని లాంచ్ చేసింది. దాదాపు ఆరేడు నెలల తర్వాత ఇప్పుడు లోకల్ లాంగ్వేజస్లోనూ ఇవ్వనుంది.