• తాజా వార్తలు

జియో ప్రీ పెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కి సిమ్ మార్చకుండానే మారడం ఎలా?

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /

భారత టెలికాం రంగం లో జియో సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇదే సమయం లో దీనిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైన విమర్శ ఏమిటంటే జియో కి సుమారు 10 కోట్ల మంది వినియోగదారులు ఉన్నప్పటికీ ఎక్కువమంది తమ ఫోన్ లలో జియో ను రెండవ సిమ్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారని. ఇందులో నిజం ఉండవచ్చు లేకపోవచ్చు కానీ జియో సిమ్ ను ఫోన్ ల లోని స్లాట్ లలో తరచుగా మారుస్తున్నరనేది మాత్రం వాస్తవం. కొన్ని సార్లు స్లాట్ ల మధ్య మాత్రమే గాక రెండు మూడు ఫోన్ ల మధ్య కూడా జియో సిమ్ ను మారుస్తున్నారు. ఈ ప్రక్రియ వలన సదరు సిమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరి మీ సిమ్ అలా డ్యామేజ్ అయినపుడు మీరు ఏం చేస్తారు? ఏముంది, మీరు ఎక్కడైతే ఆ సిమ్ ను తీసుకున్నారో అక్కడికి వెళ్లి ఆ సిమ్ రీ ప్లేస్ మెంట్ గురించి అడుగుతారు. కానీ అక్కడ మీకు ఖచ్చితంగా మరొక సిమ్ ఇవ్వరు. ఇలాంటి విషయాలకు కొన్ని ప్రత్యేకమైన స్టోర్ లు ఉంటాయి. వాటి గురించి తెలుసుకునే ముందు అసలు సిమ్ డ్యామేజ్ అయినపుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళకూడదు తదితర విషయాలను గురించి చర్చిద్దాం.
ఈ ప్రదేశాలకు వెళ్ళకూడదు.
సిమ్ కు ఏదైనా జరిగితే మనలో ఎక్కువ మంది వెళ్ళే ప్రదేశాలు జియో స్టోర్, డిజిటల్ ఎక్స్ ప్రెస్ మిని స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్. మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ స్టోర్ లకు వెళ్ళినందువలన డ్యామేజ్ సిమ్ లు మరియు పోయిన సిమ్ లు లాంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించదు. ఎందుకంటే ఈ స్టోర్ లలో కేవలం కొత్త జియో సిమ్ కనెక్షన్ లను ekyc సహాయo తో ఇస్తారు.
మరి ఎక్కడికి వెళ్ళాలి?
జియో మరియు LYF బ్రాండ్ ఫోన్ కోసం ప్రత్యేకమైన సర్వీస్ సెంటర్ లు ఉంటాయి. వీటిలో ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తారు. ఈ కస్టమర్ సర్వీస్ సెంటర్ లు వివిధ రకాల సేవలను అందిస్తాయి. కాబట్టి సిమ్ రీ ప్లేస్ మెంట్ లేదా సిమ్ పోయినా లేక మైగ్రేషన్ అవ్వాలన్నా ఇక్కడ సరైన పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ మీరు రిలయన్స్ డిజిటల్ లాంటి స్టోర్ లకు వెళ్ళినా వారు కూడా ఇక్కడికే పంపిస్తారు. మనం ఈ ఆర్టికల్ యొక్క టైటిల్ లో చెప్పుకున్నట్లు మీరు ప్రీ పెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కు మారాలన్నా కూడా ఇవే సరైన ప్రదేశాలు.
పోస్ట్ పెయిడ్ మైగ్రేషన్ ఎలా?
మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు జియో కి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా మనం కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తాము లేదా జియో అవుట్ లెట్ లకు వెళ్లి ఎంక్వైరీ చేస్తాము. ఏం చేసినా వారు మనలను పంపించే ప్రదేశo మాత్రం ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ సెంటర్ లే. ఎందుకంటే మైగ్రేషన్ ప్రక్రియ కు కొన్ని డాక్యుమెంట్ లను సమర్పించవలసి ఉంటుంది. ఈ మైగ్రేషన్ అనేది ekyc తో ట్యాగింగ్ చేయబడలేదు. రిలయన్స్ స్టోర్ లలో కేవలం ekyc ద్వారా మాత్రమే సిం లు ఇస్తారు. కాబట్టి మైగ్రేషన్ కు తప్పనిసరిగా మనం ఈ సర్వీస్ సెంటర్ లకే వెళ్ళాలి. దానికి అవసరమైన డాక్యుమెంట్ లను సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న టెలి వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తీ అయిన తర్వాత మీ సర్వీస్ లన్నీ ఆక్టివేట్ చేయబడతాయి. సరైన sms లేదా ఈమెయిలు లాంటివి చేస్తే ఈ ప్రక్రియ అంతా కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే పూర్తీ అవుతుంది. ప్రీ పెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కైనా లేక పోస్ట్ పెయిడ్ నుండి ప్రీ పెయిడ్ కి మారాలన్నా ఇదే ప్రక్రియ ను ఫాలో అవ్వవలసి ఉంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ సర్వీస్ సెంటర్ ల వివరాలు అందించడం లో మై జియో అప్లికేషను ఏ మాత్రం సహకరించదు. ఎందుకంటే ఈ యాప్ లో వాటి వివరాలు ఉండవు.
ఈ ప్ర్రక్రియ లో హైలెట్స్
ఈ మైగ్రేషన్ ప్రక్రియ అంతా కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే పూర్తీ అయిపోతుంది.
ప్రీ పెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కి గానీ లేక పోస్ట్ పెయిడ్ నుండి ప్రీ పెయిడ్ కి గానీ మైగ్రేట్ అయ్యేటపుడు కొత్త సిమ్ తీసుకోవలసిన అవసరం ఉండదు. అవును మీ ఫోన్ స్లాట్ లో ఉన్న సిమ్ ను మార్చకుండానే ఎంచక్కా మైగ్రేషన్ ను ఎంజాయ్ చేయవచ్చు.
యాక్టివేషన్ సర్వీస్ లు చాలా వేగంగా నూ మరియు డిజిటల్ గా ఉంటాయి.
మీ సిమ్ మైగ్రేషన్ కు సంబందించిన సమాచారo మై జియో యాప్ తో సింక్ అయ్యి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు