మీరు ఎప్పూడూ మీ పేరుని గూగుల్‌లో సెర్చ్ చేయకపోయినా మీకు సంబంధించిన వివరాలను వేరే వాళ్లు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. లింక్డ్ ఇన్, ట్విటర్, ఫేస్‌బుక్ లాంటి ఎన్నో సోషల్‌మీడియా సైట్లు మనకు సంబంధించిన ప్రతి వివరాలను రికార్డు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఉచితంగానే అందించేస్తున్నాయి. దీని వల్ల ఒక్కోసారి మేలు జరగచ్చేమో కానీ చాలాసార్లు మనం నష్టపోతాం. మరి మనకు తెలియకుండా మనల్ని ఎవరు ఆన్‌లైన్‌లో చూస్తున్నారో తెలుసుకోవడం ఎలా? ...దీనికి కొన్ని మార్గాలున్నాయి.. అదేంటో చూద్దాం..
లింక్డ్ ఇన్ ప్రొఫైల్ వ్యూస్
మీకు సంబంధించి సమాచారాన్ని సేకరించడానికి మనకు పరిచయం లేనివాళ్లు మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ సెర్చ్ చేస్తే చాలు. అంటే లింక్డ్ ఇన్‌లోకి వెళ్లి మీరు అప్‌లోడ్ చేసిన వివరాలు, రెజ్యూమ్‌తో సహా అన్నివివరాలు సేకరించే అవకాశం ఉంది. అయితే మీ ప్రొఫైల్‌ను ఎవరు చూశారో తెలుసుంటే అందులో ఎవరైనా అపరిచితులు ఉంటే మీరు జాగ్రత్త పడే చాన్స్ ఉంటుంది. ఆల్ ప్రొఫైల్ వ్యూవర్స్ సెక్షన్‌లోకి వెళితే మీరు ఈ వివరాలు చూడొచ్చు.
గూగుల్ అలెర్ట్స్
గూగుల్ మన జీవితంలోనే భాగమైపోయింది. అయితే మీకు సంబంధించిన వివరాలు గూగుల్ చాలా గోప్యంగా ఉంచుతుంది. మరి ఎవరైనా జీమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటి?. విలువైన సమాచారం అంతా పోయినట్టేనా? అందుకే గూగుల్ అలెర్ట్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకు తెలియకుండా ఏదైనా యాక్టివిటీ జరిగితే మనకు అలెర్ట్స్ మన ఫోన్‌కే అవి మెసేజ్‌లు వస్తాయి. అప్పుడు మనం పాస్‌వర్డ్ మార్చుకోవడం ద్వారా అకౌంట్‌ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
ఎఫ్‌బీ స్టోరీ వ్యూవర్స్
ఫేస్‌బుక్లో స్టోరీస్ గురించి అందరికి తెలుసు. మన అకౌంట్లో ఉన్న వాళ్లు ఏం అప్డేట్ చేసినా వెంటనే మనకు స్టోరీల రూపంలో కనిపిస్తాయి. అయితే వేరే వాళ్లు మన స్టోరీలను చూసి మనకు సంబంధించి సమాచారం తీసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ లో ఒక ఆప్షన్ ఉంది.. అదే ఎఫ్‌బీ స్టోరీ వ్యూవర్స్... అంటే మన స్టోరీలను ఎవరు వ్యూ చేశారో దీని ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు కొత్త వాళ్లు వ్యూ చేస్తే వారితో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.