సినిమాలు చూడాలని ఎవరికి ఉండదు.. ఎవరికి ఆసక్తిని బట్టి వారు కేటగిరిలను ఎంచుకుని సినిమాలు చూస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా సినిమాలకు వెళుతుంటారు. ఐతే మూవీస్‌కు వెళ్లాలంటే అదో పెద్ద ప్రాసెస్. సినిమా టికెట్ బుక్ చేయాలి.. ఆ సమయానికి అక్కడికి వెళ్లాలి. మద్యలో ట్రాఫిక్ లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి. అంతేకాదు సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టాలి. రూ.100తో సినిమా చూసి బయటకు వచ్చే రోజులు పోయాయి. కుటుంబంతో సహా సినిమాకు వెళితే రూ.500 వరకు ఖర్చు అవ్వాల్సిందే. సినిమాలకు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని ఆలోచించేవారు చాలా మంది ఉంటారు. మరి మనకు ఉచితంగా సినిమా చూసే అవకాశం వస్తే! అంతకంటే సంతోషం ఏముంది అంటారా! ఉచితంగా సినిమా చూడాలంటే గో మూవీస్ సైట్‌కు వె ళ్లాల్సిందే.
నిజంగానే ఫ్రీ..
ఆన్‌లైన్‌లో ఉచితంగా సినిమాలు దొరుకుతాయి. కానీ అవి క్వాలిటీ ఉండవు. ఏదో చూశాం అంటే చూశాం అన్నట్లుగా ఉంటాయి. అంతేకాదు సబ్ స్ర్కిప్షన్ కూడా చేయాలి. అదీ కొంత వ్యవధికి మాత్రమే. కొన్ని సైట్లు ఫ్రీ మూవీస్ అని పెట్టి మన క్రెడిట్ కార్డు డిటైల్స్ అడుగుతాయి. ఒకవేళ మనం ఆ వివరాలు ఇస్తే దుర్వినియోగం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడ్‌డీ క్వాలిటీతో ఉచితంగా సినిమాలు అందిస్తోంది గో మూవీస్.టీవో సైట్. దీనిలో ఎలాంటి సబ్ స్ర్ర్కిప్షన్ అవసరం లేదు. పూర్తి ఉచితంగా హెచ్‌డీ మూవీస్‌ను చూడొచ్చు. ఈ సైట్‌లో ఎక్కువ డేటాబేస్ ఉంది. అంతేకాదు ఏ సినిమాకు ఆ సినిమా చక్కగా కేటగిరి చేసి ఉంటుంది. మనకు ఎలాంటి సినిమా కావాలో సులభంగా ఎంచుకుని ఉచితంగా ఆన్‌లైన్‌లో చూసేయచ్చు. దేశాన్ని బట్టి, మూవీ కేటగిరిని బట్టి మనం ఎంచుకునే అవకాశం ఉంది. రేటింగ్ కూడా ఉండడంతో ఏ మూవీ చూడాలో మనకు వెంటనే స్పష్టత వస్తుంది.
కోరుకున్న మూవీ
ఒకవేళ మీకు నచ్చిన సినిమా దొరకకపోతే రిక్వస్ట్ ఫీచర్ అనే ఆప్షన్ ద్వారా రిక్వస్ట్ చేసి పొందొచ్చు. టాప్ ఐఎండీబీ జాబితా ద్వారా మూవీస్‌ను సులభంగా సెర్చ్ చేసి చూసేందుకు అవకాశం ఉంది. గో మూవీస్ సైట్ ద్వారా కేవలం సినిమాలు మాత్రమే కాదు మనకు నచ్చిన టీవీ షోస్‌ను కూడా చూడొచ్చు. ఫుల్ స్ర్కీన్ ఆప్షన్‌ను ఉపయోగించడం ద్వారా మరింత గొప్ప అనుభూతితో మూవీ చూసేందుకు అవకాశం ఉంది. ప్రతి సినిమాకు సంబంధించిన కాస్ట్, డైరెక్టర్, రన్నింగ్ టైమ్, మూవీ రిలీజ్ డేట్ తదితర వివరాలు కూడా ఈ సైట్‌లో ఉంచారు. ఏదైనా సినిమా చూసిన తర్వాత మన అనుభవం గురించి కామెంట్స్ చేయొచ్చు. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ ద్వారా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు.