వాట్సప్... చాలా కీలకమైన మెసేజింగ్ యాప్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రధానం చాటింగే దీని ఉద్దేశం. అయితే ఇందులో ఎంతో సున్నితమైన చాటింగ్‌లు కూడా ఉంటాయి. వాటిని ఎవరూ చూడకూడదని చాలామంది అనుకుంటారు. కానీ ఎవరి కంటిలోనైనా పడితే అవి దుర్వినియోగం అయ్యే అవకాశాలూ ఉన్నాయి. మరి మన వాట్సప్ చాట్‌ని ఎవరూ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అన్‌లాక్ విత్ ఫింగర్‌ప్రింట్
వాట్సప్ ఇటీవలే అన్‌లాక్ విత్ ఫింగర్‌ప్రింట్ అనే కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే. దీని పేరుకు తగ్గట్టుగానే వాట్సప్ అకౌంట్‌ను మనం లాక్ చేసుకోవచ్చు. దీన్ని మళ్లీ ఉపయోగించాలంటే మీ ఫింగర్ ప్రింట్ తప్పనిసరి. అంటే ఫింగర్ ప్రింట్ పెట్టగానే ఇది మళ్లీ అన్‌లాక్ అవుతుంది. ఇది ఏ రకమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకైనా పనికొస్తుంది. ఇలా అన్‌లాక్ చేసిన తర్వాత ఎవరూ మన వాట్సప్ యూజ్ చేయలేరు. మనం మాత్రమే ఫింగర్ ప్రింట్ ద్వారా మళ్లీ వాట్సప్ అకౌంట్ తెరిచే అవకాశం ఉంటుంది. సెట్టింగ్స్‌లో అన్‌లాక్ విత్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది.
ఐఫోన్ యూజర్లకు
ఐఫోన్ యూజ్ చేస్తున్నవాళ్లు తమ వాట్సప్ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవడం కోసం అన్‌లాక్ విత్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ యూజ్ చేయచ్చు. ఇంతకుముందే వాట్సప్ స్క్రీన్‌లాక్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. అన్‌లాక్ విత్ ఫింగర్ ప్రింట్ మాదిరే స్క్రీన్ లాక్ కూడా పని చేస్తుంది. దీంతో ఎవరూ మీ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఎవరూ వాడలేరు. ఫేస్ ఐడీ రికగనైజేషన్ ద్వారా మీరు ఫేస్ రిజిస్టర్ చేసుకుంటే మీరు ఇంకా సేఫ్. స్క్రీన్ లాక్ ఆప్షన్ యూజ్ చేయాలంటే మీరు ఫేస్ ఐడీ రికగనైజేషన్ తప్పనిసరి.