మొబైల్ డేటా వచ్చిన తర్వాత మామూలు మెసేజ్‌లతో చాటింగ్ చేయడం అనేది పూర్తిగా అంతరించిపోయింది. ఇలా చాట్ చేస్తున్నవాళ్లు చాలా అరుదు. వాట్సప్, టెలిగ్రామ్ లాంటి యాప్‌లు వచ్చిన తర్వాత సాధారణ మెసేజ్‌లను ఎవరూ యూజ్ చేయడం లేదు. అయితే డేటా ఉంటే మాత్రమే మనం యాప్‌లను ఉపయోగించి చాట్ చేయగలం. మరి డేటా లేకపోతే ఎలా? మనం ఈ యాప్‌లను ఉపయోగించలేం కదా! అయితే ఇందుకేం చింతించాల్సిన అసవరం లేదు. డేటా లేకుండానే, ఇంటర్నెట్ లేకుండానే చాట్ చేయడానికి కొన్నియాప్‌లు ఉన్నాయి అవేంటో చూద్దామా...
బ్లూటూత్ చాట్
ఆండ్రాయిడ్ ఫోన్లు యూజ్ చేసేవాళ్లకు బ్లూటూత్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంటర్నెట్ లేకుండా చాట్ చేయడానికి బ్లూటూత్ చాట్ అనే యాప్ ఒకటి అందుబాటులో ఉందన్న సంగతి తెలిసినవాళ్లు చాలా తక్కువమంది. ఇందుకోసం మీరు చాట్ చేయాలనుకున్న డివైజ్‌తో పాటు మీ డివైజ్‌లో బ్లూ టూత్ ఆన్ చేయాలి. స్కాన్ చేసి మీరు చాట్ చేయాలనుకున్న వారి పేరు మీద క్లిక్ చేయాలి. హోమ్ స్క్రీమ్ మీదే మీరు కన్వర్సేషన్ చేయడానికి మెసేజ్‌లు, ఫొటోలు పంపడానికి ఆప్షన్ ఉంటుంది. 100 మీటర్ల రేంజ్ వరకు మీరు ఇలా ఇంటర్నెట్ లేకుండా చాటింగ్ చేసుకునే సదుపాయం ఉంది.
టాకీ-వైఫై కాలింగ్, చాటింగ్
ఉచితంగా కాలింగ్, చాటింగ్ చేయడానికి మరో యాప్ టాకీ.. వైఫైని యూజ్ చేసుకుని ఇతర డివైజ్‌లను కనెక్ట్ చేయడానికి ఈ యాప్ యూజ్ అవుతుంది. వైఫై నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ చేయడం, లేదా మొబైల్ హాట్ స్పాట్ ద్వారా కనెక్ట్ చేయడం అనే రెండు మార్గాల ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. మీకు కావాల్సిన డివైజ్‌లపై ట్యాప్ చేసి కన్వర్షేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో చాట్ చేయడం మాత్రమే కాదు కాల్ చేయచ్చు, ఫైల్స్ సెండ్ చేయచ్చు. ఇదంతా ఇంటర్నెట్ సాయం లేకుండానే చేయచ్చు.
ఫైర్ చాట్
ఉచితంగా చాట్ చేయడానికి మరో యాప్ ఫైర్ చాట్. ఇందుకోసం ముందుగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు చాట్ చేయచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. ఫైల్స్, ఫొటోలు పంపుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే అవతలి వ్యక్తికి కూడా ఫైర్ చాట్ అకౌంట్ కావాలి. అంతేకాదు బ్లూటూత్, వైపై ద్వారా కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.