• తాజా వార్తలు

ఏ బ్రాండ్ ఫోన్‌లో అయినా మీ సొంత ఫోన్ నంబ‌ర్ తెలుసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీ మొబైల్ నంబ‌ర్ మీకు తెలుసా? అంటే ఇదేం ప్ర‌శ్న అనుకుంటారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఒకే ఫోన్ నంబ‌ర్‌ను కొన‌సాగిస్తూ ఉండే వారు త‌క్కువ మంది ఉంటారు. మ‌రీ ముఖ్యంగా ఉచితంగా సిమ్‌లు, డేటా, టాక్‌టైమ్ వంటివి ఆఫ‌ర్‌లో వ‌స్తే.. కొన్ని రోజులు ఉప‌యోగించి త‌ర్వాత వాటిని పాడేద్దాం అనే వారే ఎక్కువ‌. అయితే ఇవి ఒక్కోసారి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. బ్యాంక్ అకౌంట్లు, ఇత‌ర అవ‌స‌రాల‌కు ఆ నంబ‌ర్లు ఇస్తే ఇక తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. ఒక‌వేళ సిమ్ దొరికినా.. ఆ నంబ‌ర్ తెలియ‌క ఇబ్బందులు ప‌డాల్సిందే! మ‌రి ఈ స‌మ‌యంలో ఎలాంటి కంగారు లేకుండా ఉంటే స‌మాధానం అదే.. ఫోన్ నంబ‌రు సులువుగా తెలుసుకోవ‌చ్చు. అదెలా అంటారా.. ఫోన్‌లో ఉండే చాలా ఆప్ష‌న్లను ఎలా ఉప‌యోగించాలో చాలా మందికి తెలియ‌దు. కొన్ని చిన్న ప‌ద్ధ‌తులు తెలుసుకుంటే.. ఏ ఫోన్ ఉప‌యోగిస్తున్నా సిమ్ నంబ‌ర్ క‌నుక్కోవ‌డం కష్ట‌మేమీ కాదు. ఎంఐ, శామ్‌సంగ్‌, హెచ్‌టీసీ, హాన‌ర్‌, వ‌న్ ప్ల‌స్ ఇలా.. ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయినా ఫోన్ నంబ‌ర్ ఎలా క‌నుక్కోవాలో తెలుసుకుందాం! 

* ముందుగా ఫోన్‌లో సెట్టింగ్ ఓపెన్ చేయాలి. 
* ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లో బాగా కిందికి వెళితే.. About phone లేదా About device ఆప్ష‌న్ ఎంచుకోవాలి. (కొన్ని ఆండ్రాయిడ్ వెర్ష‌న్ల‌లో ఫోన్ నంబ‌ర్ కూడా అక్క‌డే క‌నిపిస్తుంది. 
* ఒక‌వేళ ఎల్‌జీ జీ4 ఫోన్ ఉప‌యోగిస్తుంటే.. జ‌న‌ర‌ల్ అనే ఆప్ష‌న్‌ను ముందుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. త‌ర్వాత అబౌట్ ఫోన్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 
* త‌ర్వాత Status లేదా phone identityపై ట్యాప్ చేయాలి. ( హెచ్‌టీసీ ఫోన్ల‌లో ఫోన్ ఐడెంటిటీ అనే ఆప్షన్ ఉంటుంది). త‌ర్వాత కిందికి వెళితే.. 
My phone number అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. సో.. దీనిని ట్యాప్ చేస్తే ఫోన్ నంబ‌ర్ తెలుసుకోవ‌చ్చు. 
* ఇక మోటో వంటి మోడ‌ళ్ల‌లో సిమ్ స్టేట‌స్ ఆప్ష‌న్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో My phone number ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

జన రంజకమైన వార్తలు