• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ డేటాను డిలీట్ చేసి ఫోన్ స్టోరేజ్ పెంచుకోవ‌డం ఎలా?

వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు దాదాపు లేవ‌నే చెప్పాలి. బంధుమిత్రులు, ఆఫీస్ వ్య‌వ‌హారాలు, ఇంకా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ గ్రూప్‌ల్లో బోల్డ‌న్ని మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు వ‌చ్చి ప‌డుతుంటాయి. ఇవ‌న్నీ మీ ఫోన్‌లో స్టోర్ అయిపోతాయి. దీంతో ఫోన్ స్టోరేజ్ త‌గ్గిపోతుంది. ఫోన్లో ఇలా స్టోరేజ్ నిండిపోయే కొద్దీ అవ‌స‌ర‌మైన డేటాకు స్పేస్ ఉండ‌దు. అంతేకాదు ఫోన్ స్లో అయ్యే అవ‌కాశ‌మూ ఉంది. అందుకే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ డేటాను మేనేజ్ చేసుకోవాలి. అన‌వ‌స‌ర‌మైన‌వి అనుకున్న‌వి డిలెట్ చేసుకుంటే ఫోన్లో స్టోరేజ్ మిగులుతుంది. 

ఫోన్లో వాట్సాప్ డేటాను డిలీట్ చేయ‌డం ఎలా?
* ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* పైన ఉన్న త్రీడాట్స్ మెనూను క్లిక్ చేయండి.
* ఇప్ప‌డు సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
* డేటా అండ్ స్టోరేజ్‌యూసేజ్ ఆప్ష‌న్ క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీ ఫోన్లో వాట్సాప్ ఎంత స్టోరేజ్ ఆక్ర‌మించిందో క‌నిపిస్తుంది.  అంతేకాదు మీ ఫోన్‌లో ఇంకెంత స్టోరేజ్ మిగిలి ఉందో కూడా చూపిస్తుంది.
* వాట్సాప్ తెచ్చిన కొత్త టూల్ ప్ర‌కారం వ్య‌క్త‌లు లేదా గ్రూప్స్ నుంచి వ‌చ్చిన మెసేజ్‌లు ఎంత స్టోరేజ్ తీసుకున్నాయో క‌నిపిస్తుంది. ఇందులో ప‌దే ప‌దే వ‌చ్చే ఫార్వ‌ర్డ్ మెసేజ్‌లు, 5 ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ కూడా థంబ్ నెయిల్స్ రూపంలో క‌నిపిస్తాయి.
* వీటిలో అవ‌స‌రం లేవు అనుకున్న‌వాటిని టిక్ చేసి డిలీట్ చేయండి.
* ఇప్పుడు ఆటోమేటిగ్గా మీ ఫోన్‌లో స్టోరేజ్ పెరుగుతుంది.

జన రంజకమైన వార్తలు