• తాజా వార్తలు

వాట్స‌ప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌ల‌ను రిక‌వ‌ర్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌. ఫేస్‌బుక్ సార‌థ్యంలోని ఈ యాప్ రోజు రోజుకు త‌న యూజ‌ర్ల‌ను పెంచుకుంటూపోతోంది. కోట్లాదిమంది యూజ‌ర్లు వాట్స‌ప్ స్థాయిని మ‌రింత పెంచుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్టే వాట్స‌ప్ కూడా కొత్త కొత్త అప్‌డేట్స్‌తో వినియోగ‌దారులను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిలో భాగంగానే గ‌తేడాది డిలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ అనే ఆప్ష‌న్ తెచ్చింది. అయితే ఈ ఆప్ష‌న్ వ‌ల్ల ఒక్కోసారి కీల‌క‌మైన మెసేజ్‌లు కూడా డిలీట్ అయిన‌పోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. మ‌రి ఇలా డిలీట్ అయిన మెసేజ్‌ల‌ను తిరిగి పొందాలంటే ఏం చేయాలి?

ఇలా రీస్టోర్ చేసుకోండి (ప‌ద్ధ‌తి 1)
1. వాట్స‌ప్ యాప్‌ని అన్ ఇన్‌స్టాల్ చేయాలి

2.  అదే ఫోన్లో అదే నంబ‌ర్‌తో మ‌ళ్లీ వాట్స‌ప్‌ను రీ ఇన్‌స్టాల్ చేయాలి

3. ఆ త‌ర్వాత రీస్టోర్ ఓల్డ్ చాట్స్ అనే ఒక ఆప్ష‌న్ ప్రాంప్ట్ చేసిన‌ప్పుడు దానిపై ట్యాప్ చేసి అది రీస్టోర్ అయ్యేదాకా వెయిట్ చేయాలి

ప‌ద్ధ‌తి-2

1. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫైల్ మేనేజ‌ర్‌ని క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత వాట్స‌ప్ డేటాబేస్‌పై ట్యాప్ చేయాలి

2. మెసేజ్‌స్టోర్‌.డీబీ.క్రిప్ట్‌12ను మెసేజ్‌స్టోర్‌_బ్యాక్అప్‌.డీబీ.క్రిప్ట్‌12గా రినేమ్ చేయాలి

3. ఆ తర్వాత మీకు ఎంఎస్‌జీస్టోర్-వైవైవైవై-ఎంఎం-డీడీ.1డీబీక్రిప్ట్‌12 అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఎంఎస్‌జీస్టోర్‌.డీబీ.క్రిప్ట్‌12గా రీనేమ్ చేయాలి

4. గూగుల్ డ్రైవ్‌ను ఓపెన్ చేసి టాప్ లెఫ్ట్ కార్న‌ర్‌లో ఉన్న త్రి వ‌ర్టిక‌ల్ లైన్స్‌ను క్లిక్ చేయాలి

5. బ్యాక్ అండ్ డిలీట్ ఆప్ష‌న్ ట్యాప్ చేయాలి

6. ఆ త‌ర్వాత మీ ఫోన్లో వాట్స‌ప్ అన్ ఇనిస్టాల్ చేసి అదే అకౌంట్ పేరిట రీ ఇన్‌స్టాల్ చేయాలి.

7. ఎంఎస్‌జీస్టోర్‌.డీబీ.క్రిప్ట్‌12  ప్రాంప్ట్ చేయ‌గానే రీస్టోర్ చేయాలి. ఆ త‌ర్వాత కొద్దిసేపు వెయిట్ చేస్తే బ్యాక‌ప్ కంప్లీట్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు