ఇప్పుడు ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అనే ఆప్షన్ ఉంటుంది. ముఖ్యంగా చైనా తయారు చేస్తున్న ఫోన్లలో ఈ ఫీచర్ కామన్‌గా ఉంటోంది. ఒకప్పుడు ఐఫోన్‌లో మాత్రమే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అనే ఆప్షన్ ఉండేది. అందుకే మిగిలిన ఫోన్ల కంటే ఐఫోన్‌ను సురక్షితంగా భావించేవాళ్లు. ఇప్పుడు ఒక మోస్తారు స్మార్ట్‌ఫోన్లో సైతం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కామన్ అయిపోయింది. మరి ఈ ఆప్షన్‌తో ఏంటి అంత ఉపయోగం? ..అసలు ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఎలా పని చేస్తాయి? ఇవి ఎంతవరకు సురక్షితం?
సెల్‌ఫోన్ సెక్యూరిటీ ఇది ఇప్పుడు చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటే మన స్మార్ట్‌ఫోన్‌తో ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలన్నీసెల్‌ఫోన్ ద్వారానే చేస్తాం. మరి అంతటి కీలకమైన స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా దొంగిస్తే... మన విలువైన సమాచారం ప్రమాదంలో పడుతుంది. ఇలా జరగకుండా ఉండడం కోసమే సెల్‌ఫోన్ కంపెనీలు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్ ఏర్పాటు చేశాయి. ఇది ప్రధానోద్దేశం యూనిక్ ఐడెంటిటీ. మన ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే స్మార్ట్‌ఫోన్లు ఓపెన్ అవుతాయి. ఫింగర్‌ప్రింట్‌తో పాటు ప్యాట్రన్, పిన్, పాస్‌వర్డ్, ఐరిస్, ఫేస్ రికగనైజేషన్ లాంటి సెక్యూరిటీ ఆప్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిలో ఫింగర్ ప్రింట్ చాలా సురక్షితమనేది నిపుణుల మాట.
ఎలా పని చేస్తుందంటే..
ప్రతి మనిషి ఫింగర్‌ప్రింట్‌లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి రిడ్జెజ్. ఫింగర్ ఉపరితంలో ఉంటే ప్రాంతం. రిడ్జెస్ మధ్య ఉండే ఖాళీలను వాలీస్ అంటారు. సెల్‌ఫోన్ స్కానర్ మీద యూజర్ తన వేలిని ఉంచినప్పుడు .. ఛార్జెడ్ కపుల్డ్ డివైజ్ (సీసీడీ) లైట్ సెన్సార్ ఫింగర్ ఇమేజ్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో ఉండే ఎల్ఈడీ రిడ్జెస్, వాలీస్‌ను పసికడుతుంది. అంటే ఇది ఒక వేలిన రెండు రకాల ఇమేజ్‌లుగా క్రియేట్ చేస్తుంది. నల్లగా ఉన్న ప్రాంతం రిడ్జెస్‌గా. . లైట్‌గా ఉన్న ప్రాంతం వాలీస్‌గా చెప్పొచ్చు. అంటే ఒకసారి మనం ఫింగర్ పెట్టగానే మన ఫింగర్ ఇమేజ్ ఇందులో సేవ్ అయిపోతుంది. అది కూడా చాలా సుక్ష్మంగా సేవ్ అవుతుంది. మన ఫింగర్‌లో ప్రతి అణువు ఈ డివైజ్ గుర్తిస్తుంది. అంటే వేరెవరైనా మన డివైజ్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే సెన్సార్ గుర్తించదు. మన వేలిని మాత్రమే ఇది గుర్తుపడుతుంది. ఇదే దీని ప్రత్యేకత. అందుకే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను మించిన సెక్యూరిట మరొకటి లేదు.