• తాజా వార్తలు

ఎస్‌బీఐ వారి ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయ‌ల్ ఎలా ప‌నిచేస్తుంది? 

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

మీరు ఎస్‌బీఐ ఖాతాదారా?  మీ డెబిట్ కార్డ్‌తో  ఏటీఎం నుంచి 10వేలు కంటే ఎక్కువ తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మీ మొబైల్ ఫోన్ ద‌గ్గ‌ర ఉంచుకోవాల్సిందే. లేదంటే మీరు మ‌నీ విత్‌డ్రా చేయ‌లేరు.  10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని మీరు ఏటీఎం నుంచి డ్రా చేయాలంటే ఓటీపీ ఎంట‌ర్ చేయాల్సిందేన‌ని ఎస్‌బీఐ ఇటీవ‌లే తన క‌స్ట‌మ‌ర్లంద‌రికీ మెసేజ్‌లు పంపింది.  మీ సొమ్ముకు అద‌న‌పు భ‌ద్ర‌త కోసం ఈ ఏర్పాటు చేస్తున్నామ‌ని పేర్కొంది. 

ఎలా ప‌ని చేస్తుంది?
* ఎస్‌బీఐ ఏటీఎంలో  మీ డెబిట్ కార్డ్ పెట్టాలి. 
* 10వేల కంటే ఎక్కువ విత్‌డ్రాయ‌ల్ చేయ‌డానికి మీరు ఎంట‌ర్ చేయ‌గానే మీ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది.
* పిన్ నెంబ‌ర్‌తో పాటు ఈ ఓటీపీ నెంబ‌ర్‌ను కూడా మీరు ఏటీఎంలో ఎంట‌ర్ చేయాలి.
* అప్పుడే  మీకు డ‌బ్బులు వ‌స్తాయి. 

ఎప్పుడు ప‌ని చేయ‌దంటే?
* ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌ను మీరు ఇత‌ర బ్యాంకుల ఏటీఎంలో పెట్టి 10వేలకు పైగా అమౌంట్ డ్రా చేసినా ఈ ఫీచ‌ర్ ప‌ని చేయ‌దు. 
*  ఉద‌యం 8 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఎస్‌బీఐ ఏటీఎంలో విత్‌డ్రా చేసినా ఓటీపీ మెసేజ్ వ‌స్తుంది. ఆ త‌ర్వాత‌గానీ అంత‌కు ముందుగానీ అయితే మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో  10 వేల‌కు మించి అమౌంట్ తీసుకోలేరు. 

మొబైల్ నంబ‌ర్ రిజిస్ట‌ర్ చేయించుకోండి
10వేల కంటే ఎక్కువ మొత్తం ఎస్‌బీఐ ఏటీఎంలో నుంచి తీసుకోవాలంటే ఓటీపీ అవ‌సరం కాబ‌ట్టి ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లంతా త‌మ మొబైల్ నెంబ‌ర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు సింక్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.  దాదాపు క‌స్ట‌మ‌ర్లంతా దీన్ని పాటిస్తున్నారు.  ఇంకా ఎవ‌రైనా చేయ‌నివారు ఉంటే వెంట‌నే మొబైల్ నెంబ‌ర్‌ను ద‌గ్గ‌ర‌లో ఉన్న ఎస్‌బీఐలో రిజిస్ట‌ర్ చేయించుకోవాల‌ని బ్యాంక్ ప్ర‌క‌టించింది.
 

జన రంజకమైన వార్తలు