భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే సమాచార ప్రసార సాధనాల్లో స్పీడ్ పోస్ట్ ఒకటి. డిజిటల్ విప్లవం నేపథ్యంలో సాధారణ పోస్టుల జోరు ప్రస్తుతం తగ్గినా స్పీడ్ పోస్టుకు ఇంకా విలువ ఉంది. ఏదైనా లెటర్స్ లేదా ముఖ్యమైన సమాచారాన్ని వేగంగా, సురక్షితంగా పంపడానికి ఎక్కువగా ఈ మీడియంనే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు లెటర్స్ పంపడటానికి, బ్యాంకులు కార్డులు పంపించడానికి స్పీడ్‌పోస్టును ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే స్పీడ్ పోస్ట్ ఎక్కడ ఉంది... దాని స్టేటస్ ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ..దానికి ఒక పద్ధతి ఉంది అదెంటో చూద్దాం..
పోస్టల్ సర్వీసులను ట్రాక్ చేయడం కోసం ప్రస్తుతం వందల థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నా ప్రభుత్వ వెబ్ సైట్లను మాత్రమే ఉపయోగించాలి. ఇండియా పోస్ట్, మినిస్టరీ ఆఫ్ కమ్యూనికేషన్స్ లాంటి ప్రభుత్వ సైట్లను ఉపయోగించుకోవాలి. ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ ఇతర పోస్టల్ సర్వీసులను కూడా ఉపయోగించొచ్చు. రాకీలు పంపుకోవడానికి, ఇతర వస్తువులను పంపడానికి కూడా ఈ సర్వీసులను వాడుకోవచ్చు. ఫస్ట్ ఫ్లయిట్ కొరియర్ లిమిటెడ్, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, డీటీడీసీ కొరియర్, కార్గొ లిమిటెడ్, ప్రొఫెషనల్ కొరియర్ లిమిటెడ్, ఫెడెక్స్ ఇండియా, గాటి లిమిటెడ్, డీహెచ్ఎల్ లాంటి సర్వీసుల ద్వారా కూడా మనం ఆర్టికల్స్ పంపుకోవచ్చు. ట్రాక్ చేసుకోవచ్చు.
ట్రాక్ చేయాలంటే..
మనకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయడం కోసం అఫీషియల్ వెబ్‌సైట్ క్లిక్ చేయాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌ను రెండు రకాలుగా విజిట్ చేయచ్చు. ఒకటి నేరుగా బ్రౌజర్‌గా యూఆర్ ఎల్‌ను టైప్ చేయడం ద్వారా లేదా గూగుల్‌లో ఇండియాపోస్ట్‌జీవోవీ.ఇన్ అనే సైట్ పేరుతో కూడా చెక్ చేయచ్చు. ఈ సైట్‌లోకి వెళ్లిన తర్వాత ఇండియా పోస్ట్ ట్రాకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దానిలో మీకు ఇచ్చే స్పీడ్ పోస్టుకు సంబంధించిన ట్రాకింగ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఒకే క్లిక్ చేస్తే మీ స్పీడ్ పోస్టు ఎక్కడ ఏ దశలో ఉంది.. ఎప్పుడు మిమ్మల్ని చేరుతుందనే విషయాలు మీకు తెలుస్తాయి. ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీకు కొరియర్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి.