• తాజా వార్తలు

మీరు సొంత‌గా ఎమోజీ క్రియేట్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

ఏదైనా అకేష‌న్ ఉన్న‌ప్పుడు ఫ‌న్ క్రియేట్ చేయ‌డానికి ఎమోజీలు త‌యారు చేయ‌డం చాలా మామూలే. అయితే ఎమోజీ క్రియేట్ చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్‌. కానీ దీనికి చాలా ఖ‌ర్చు అవుతుంది. మ‌రి ఖ‌ర్చు ఏం లేకుండా మ‌న‌కు మ‌న‌మే సొంత‌గా ఎమోజీ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది క‌దా... మ‌రి సొంత‌గా ఎమోజీ క్రియేట్ చేసుకోవ‌డం ఎలా?

ఐఫోన్లో అయితే ఇలా..
ఐఫోన్ ఉపయోగించే వాళ్లు ఎమోజీని క్రియేట్ చేయ‌డం చాలా సుల‌భం. ఇందుకోసం ఎమోజీలీ యాప్ ఉప‌యోగించుకోవ‌చ్చు. దీనిలో ఉండే స్క్రాట్ ఆప్ష‌న్ ద్వారా మ‌నం ర్యాండ‌మ్‌గా ఎమోజీల‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు. మీ ఎమోష‌న్స్‌కు త‌గ్గ‌ట్టుగా ఇది ఎమోజీల‌ను క్రియేట్ చేస్తుంది. ఎమోజీ క్రియేట్ చేయ‌డం కోసం న్యూ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.

1. మ‌ల్టిపుల్ క‌ల‌ర్డ్ బేస్‌, స్క్వేర్ ఫేస్‌, టాకో హెడ్ టెంప్లెట్ మీద క్లిక్ చేయాలి

2. ఆ త‌ర్వాత పెయిర్ ఆఫ్ ఐస్ మీద క్లిక్ చేయాలి

3. మీకు కావాల్సిన ఐబ్రోస్ మీద క్లిక్ చేయాలి

4. మౌత్ ఆప్ష‌న్ మీద ట్యాప్ చేసి సుట‌బుల్ అయిన దాన్ని ఎంచుకోవాలి

5. ఫేసియ‌ల్ హెయిర్‌ని యాడ్ చేసుకోవాలి

6. అవ‌స‌ర‌మైతే కొన్ని హ్యాండ్ జెస్చ‌ర్ల‌ను పిక్ చేసుకోవాలి.  ఒక హ్యాట్ కూడా ఎంచుకోవాలి

7. సెట్టింగ్స్‌లోకి వెళ్లి కీబోర్డ్స్‌, యాడ్ న్యూ కీబోర్డ్‌, ఎమోజీలీ మీద క్లిక్ చేయాలి అంతే మీకు న‌చ్చిన ఎమోజీ రెడీ అయిన‌ట్టే!

ఆండ్రాయిడ్‌లో ఇలా చేయాలి...
ఆండ్రాయిడ్‌లో అయితే ఎమోజీ మేక‌ర్ అనే టూల్ మీకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ద్వారా ఎలా ఎమోజీల‌ను సృష్టించాలో తెలుసుకుందాం

1. హోమ్ స్క్రీన్‌లోకి వెళ్లి న్యూ ఎమోజీ ఆప్ష‌న్ ఎంచుకోవాలి

2. మీ ఎమోజీకి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోవాలి. డాగ్‌, బేర్‌, హార్ట్ ఇలా ఏదైనా ఫ‌ర్వాలేదు

3. ఐబ్రోస్‌, ఐస్‌, మౌత్‌, హ్యాండ్ జెస్చ‌ర్స్‌, హెయిర్‌, ఫేసియ‌ల్ హెయిర్‌, మాస్క్ ల‌ను ఎంచుకోవాలి. 

4. క‌స్ట‌మ్ ఎమోజీని టిక్ చేసుకోవాలి

5. ఎమోజీ మీద క్లిక్ చేసి షేర్ చేసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు