సాధారణంగా క్రెడిట్ కార్డు లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను పీడీఎఫ్ ల ద్వారా కస్టమర్లకు పంపుతూ ఉంటారు. అయితే ఇవి ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులో ఉండే సమాచారం మనకు కనబడిపోదు. ఎందుకంటే ఈ పీడీఎఫ్‌లో పాస్వర్డ్ ప్రొటెక్టెడ్‌గా ఉంటాయి. వీటిని మామూలు ఫైల్స్‌లాగా ఓపెన్ చేయడం కుదరదు. మరి ఇలా ప్రొటెక్డ్గా ఉన్న పీడీఎఫ్ ఫైల్‌ను ఎలా ఓపెన్ చేయాలి?
ప్రొటెక్డడ్ పీడీఎఫ్‌ను ఓపెన్ చేయడం కోసం కొన్ని సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్కీ పీడీఎఫ్ పాస్వర్డ్ రికవరీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఇదే కాదు వండర్ షేర్ పాస్వర్డ్ రికవర్ లాంటి ఎన్నో సాఫ్ట్వేర్లు పీడీఎఫ్‌లను ఓపెన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఐసీ పాస్వర్డ్ డీఆర్. పీడీఎఫ్ అనే సాఫ్ట్వేర్ పీడీఎఫ్ పాస్వర్డ్ రికవరీ చేయడానికి బాగా ఉపయోగించుకోవచ్చు. పాస్వర్డ్ రికవర్ చేసుకోవడానికి ఇదో ప్రొఫెషన్ టూల్ అని చెప్పుకోవచ్చు. ఇది సులభంగా మన పీడీఎఫ్ పాస్వర్డ్ లాక్‌ను సులభంగా రిమూవ్ చేస్తుంది. మీరు కంటెంట్‌ను కాపీ చేసుకోవచ్చు.. ఎడిట్ చేసుకోవచ్చు.. చివరికి ప్రింట్ కూడా చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.
ఎలా ఉపయోగించాలంటే..
1. డీఆర్.పీడీఎఫ్ ప్రొగ్రామ్‌ను విండోస్ లేదా మ్యాక్ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేయాలి. దీనిలో రెండు ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. ఒకటి పీడీఎఫ్ నుంచి పాస్వర్డ్ ఓపెన్ చేసేది.. ఇంకొకటి పాస్‌వర్డ్‌ను రిమూవ్ చేసేది.
2. ఆ తర్వాత పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడీఎఫ్‌ను ఇంపోర్ట్ చేసుకుని.. యాడ్ ఫైల్ బటన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
3. సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకున్న తర్వాత స్టార్ట్ సెర్చింగ్ పీడీఎఫ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. పాస్వర్డ్ క్లిష్టంగా ఉంటే రికవరీకి గంటలు కూడా సమయం పట్టొచ్చు. లేకపోతే మీకు నిమిషాల్లోనే తెలిసిపోతుంది.
4. పాస్వర్డ్ దొరికాక ఇది పోపప్ మెనూ ద్వారా మనకు ఒక సందేశం వస్తుంది.