పీడీఎఫ్ ఫైల్ లో సైన్ కావాలని అనుకుంటున్నారా.. తిరిగి దాన్ని ఆన్ లైన్లో పెట్టాలని భావిస్తున్నారా? ఇది చాలా సులభమైన ప్రక్రియ. సాధారణంగా సైన్ కోసం ఒక పేపర్ ను యూజ్ చేసి దాన్ని తిరిగి పీడీఎఫ్ ఫైల్ లో పెడుతూ ఉంటారు. అయితే తాజా టెక్నిక్ ద్వారా మీకు పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీని వల్ల పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్లు అవుతారు. మరి ఇది ఇలా చేయాలో చూద్దాం.
విండోస్, ఆండ్రాయిడ్ ఓఎస్ లో
పీడీఎఫ్ డాక్యుమెంట్లో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ని చేయడం అంత కష్టమేం కాదు. ఇందుకోసం అడోబ్ ఆక్రోబాట్ రీడర్ ని ఉపయోగించొచ్చు. ముందుగా మీరు ఏ అడోబ్ రీడర్ లో సిగ్నేచర్ చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేయాలి. ఫిల్, సైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ సెక్షన్ లోనే మీకు యాడ్ టెక్ట్, యాడ్ చెక్ మార్క్, ప్లేస్ ఇన్షియల్స్, ప్లేస్ సిగ్నేచర్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
సెండ్, కలెక్ట్ సిగ్నేచర్
ఇందులోనే మీకు సెండ్ అండ్ కలెక్ట్ సిగ్నేచర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్లేస్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మీరు ఎలా సిగ్నచర్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు అని అడుగుతుంది. టైప్ సిగ్నేచర్, యూజ్ ఏ వెబ్ కామ్, యూజ్ ఏ సర్టిఫికెట్ అనకే ఆప్షన్లు కనిపిస్తాయి. టైప్ సిగ్నేచర్ పై క్లిక్ చేసి మీ పేరు టైప్ చేయాలి. మీ సిగ్నేచర్ ని రివ్యూ చేసుకుని యాక్సెప్ట్ కొట్టాలి. మాక్, యాపిల్ లా దాదాపు సిగ్నేచర్ ఇలాగే చేయాలి.