• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ ట్రేకి టాస్క్స్  యాడ్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

రేపు ఏం చేయాలి? ఫ‌లానా గంట‌కు ఫ‌లానా నిమిషానికి ఏం  ప‌ని చేయాల‌నేది మ‌నం టాస్క్‌లో రూపొందించుకుని ఫోన్‌లో సేవ్ చేసుకుంటున్నాం. దీంతో మ‌న ఫోన్లో మ‌న‌కు ఓ మంచి ప్లాన‌ర్ ఉన్న‌ట్లే. అయితే ఈ టాస్క్స్‌ను నోటిఫికేష‌న్ ట్రేకు యాడ్ చేసే అవ‌కాశం ఆండ్రాయిడ్‌లో ఇన్‌బిల్ట్ ఆప్ష‌న్‌గా లేదు. అయితే టిక్‌టిక్ అనే ఓ సింపుల్ యాప్‌తో మీ టాస్క్స్‌ను నోటిఫికేష‌న్ ట్రేకి యాడ్ చేసుకోవ‌చ్చు. ఒక‌సారి టాస్క్స్‌ను నోటిఫికేష‌న్ ట్రేలో పెట్టుకుంటే జ‌స్ట్ ఇలా స్లైడ్ చేస్తే చాలు మీ టాస్క్ ఏమిటో చూసుకోవ‌చ్చు. నోటిఫికేష‌న్ స్క్రీన్ మీద ఓ చిన్న కార్డ్ రూపంలో టాస్క్స్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు మీ టాస్క్‌ల‌న్నీ ఒకేసారి నోటిఫికేష‌న్ స్క్రీన్ మీద క‌నిపిస్తాయి. 

ఎలా వాడుకోవాలి?
1. ప్లే స్టోర్‌లోకి వెళ్లి TickTick (టిక్‌టిక్‌) యాప్ డౌన్‌లోడ్ చేయండి. యాప్ ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. 

2. యాప్‌లో కింద ఉన్న Tasks ట్యాబ్‌కి వెళ్లి + గుర్తును క్లిక్ చేసి మీ టాస్క్‌ను రాయండి. టెక్స్ట్ ఫీల్డ్ కింద భాగంలో డ్యూ టైమ్‌, టాస్క్ ప్ర‌యారిటీ, యాడ్ ట్యాగ్స్ ఆప్ష‌న్స్ క‌నిపిస్తాయి. మీకు అవ‌స‌ర‌మైన‌వి వాడుకుని టాస్క్ క్రియేట్ చేయండి. 

3. ఇదే ఆప్ష‌న్‌లో చివ‌ర ఉన్న యారో మార్క్‌ను క్లిక్ చేస్తే టాస్క్ సేవ్ అవుతుంది.  ఇలా ఎన్ని టాస్క్‌ల‌యినా క్రియేట్ చేసుకోండి. 

4.ఇప్పుడు ఈ టాస్క్‌ల‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని నోటిఫికేష‌న్ ట్రేకి యాడ్ చేయాలి. ఇందుకోసం యాప్ Settingsలోకి వెళ్లి Advanced Settingsని క్లిక్ చేయండి.  

5 Status Bar అనే ఆప్ష‌న్ కనిపిస్తుంది. స్లైడ‌ర్ బ‌ట‌న్‌ను ఆన్ చేసి దీన్ని అనేబుల్ చేసుకోండి. అంతే మీ టాస్క్‌ల లిస్ట్‌ను ఫోన్ నోటిఫికేష‌న్స్‌లో యాడ్ చేసేస్తుంది. 

6. నోటిఫికేష‌న్ ట్రేను కిందికి స్లైడ్ చేస్తే మీరు టిక్‌టిక్ యాప్‌లో క్రియేట్ చేసిన టాస్క్‌ల‌న్నీ క‌నిపిస్తాయి. ఇత‌ర నోటిఫికేష‌న్ల మాదిరిగానే దీన్ని కూడా స్వైప్ చేసి రిమూవ్ చేయ‌లేరు. అంటే మీ టాస్క్ పూర్త‌య్యేవ‌ర‌కు నోటిఫికేష‌న్‌లో నుంచి అది తొల‌గించ‌బ‌డ‌దు. 

7. మీరు ఒక‌టి కంటే ఎక్కువ టాస్క్‌లు క్రియేట్ చేసి ఉంటే నోటిఫికేష‌న్ ట్రేలో ఉన్న యారో ఐకాన్‌ను  క్లిక్ చేస్తే ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి క‌నిపిస్తాయి. 

టాస్క్ రిమూవ్ చేయాలంటే..
టిక్‌టిక్ యాప్ ద్వారా క్రియేట్ చేసుకున్న టాస్క్‌ల‌ను రిమూవ్ చేయాలంటే ఆ టాస్క్‌ను సెలెక్ట్ చేసి టాస్క్ కార్డ్ మీద టాప్ చేయాలి. ఇది టిక్‌టిక్  యాప్‌ను ఓపెన్ చేస్తుంది. అందులో చిన్న చిన్న చెక్ బాక్స్‌లు ఉంటాయి.  ఆ బాక్స్‌లో టిక్ చేస్తే ఆ టాస్క్ మీ ఫోన్  నోటిఫికేష‌న్  నుంచి తొల‌గించ‌బ‌డుతుంది.

జన రంజకమైన వార్తలు