• తాజా వార్తలు

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.  ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్, ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఖాతాదారులు తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. 

మిస్డ్ కాల్ తో బాలన్స్ చెక్  మిస్డ్ కాల్ ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో తెలుసుకోవచ్చు.

యూఏఎన్ అకౌంట్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ లో వస్తాయి.

 ఒక్క ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు .ఈపీఎఫ్ఓ అకౌంట్లో రిజిస్టర్డ్ అయిన మీ మొబైల్ నుంచి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్‌లో వస్తాయి. 

ఈపీఎఫ్ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/ లో లాగిన్ అయి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

లాగిన్ అయిన తర్వాత Our Services ట్యాబ్‌లో for employees సెలెక్ట్ చేయాలి.           

Services ఆప్షన్‌లో Member passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు.

జన రంజకమైన వార్తలు