• తాజా వార్తలు

వాట్సాప్ ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ తయారు చేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

వాట్సాప్ ఇప్పుడు స‌మాచార మార్పిడికే కాదు వ్యాపారుల‌కు కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. వాట్సాప్‌లో త‌మ ద‌గ్గ‌రున్న ప్రొడ‌క్ట్‌ల వివ‌రాలు షేర్ చేసి  వాటిని విక్రయించుకోవ‌డం ద్వారా బిజినెస్ పంచుకుంటున్నారు. ఇలాంటి వారి కోస‌మే ప్ర‌త్యేకంగా వాట్సాప్ బిజినెస్ కూడా అందుబాటులోకి వ‌చ్చింది.  వాట్సాప్ య‌జ‌మాని అయిన ఫేస్‌బుక్ ఈ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ల వారికి మ‌రింత సౌల‌భ్యంగా ఉండేందుకు ప్రత్యేకంగా ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశపెట్టింది అమెరికా, బ్రెజిల్‌, బ్రిట‌న్ లాంటి దేశాల‌తోపాటు ఇండియాలోని వాట్సాప్ బిజినెస్ యూజ‌ర్ల‌కు కూడా ఈ ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది.  దీని ఉప‌యోగాలేంటి? క‌్యాట‌లాగ్ ఎలా సెట్ చేసుకోవాలి?  తెలుసుకుందాం. 

ఏంటి  ఉప‌యోగం?
పెద్ద పెద్ద షోరూమ్‌లు కాకుండా ఇంటిలో నుంచే చిన్న‌గా బిజినెస్ ప్రారంభించి టెక్నాల‌జీ తోడుగా ఎద‌గాల‌నుకునేవారికి వాట్సాప్ బిజినెస్ యాప్ మంచి సాధ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతోంది. ఇప్ప‌డు దీనిలో కొత్త‌గా వ‌చ్చిన క్యాట‌లాగ్ ఫీచ‌ర్ మీ బిజినెస్‌కు ఒక షో కేస్ లాంటిది. ఈ క్యాట‌లాగ్ మీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ప్రొఫైల్‌లో క‌న‌ప‌డ్డం వ‌ల్ల క‌స్ట‌మ‌ర్లు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఇంత‌కు ముందులాగా ఒక వ్య‌క్తికో లేదా గ్రూప్‌కో విడివిడిగా మీ ప్రొడ‌క్ట్‌ల‌న్నీ పంపే ఇబ్బంది త‌ప్పుతుంది. డేటాతోపాటు విలువైన స‌మ‌య‌మూ ఆదా అవుతుంది. అంతేకాదు అవ‌స‌ర‌మైన‌వారే చూసుకుంటారు. మిగతావారు ప్రొడ‌క్ట్ మెసేజ్‌లు పెడితే చూసి అసౌక‌ర్యం ఫీల‌వ‌కుండా ఉంటారు. 

ఎలా క్రియేట్ చేసుకోవాలి? 
ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ త‌యారుచేయాలంటే మీ ద‌గ్గ‌రున్న ప్రొడ‌క్ట్‌ల‌కు సంబంధించిన ఫోటోలు, వాటి గురించి కొద్దిగా వివ‌రాలు, ఓ లింక్ ఉండాలి. 

* వాట్సాప్ బిజినెస్ అకౌంట్లోని సెట్టింగ్స్‌లోకి వెళితే అక్క‌డ  బిజినెస్ సెట్టింగ్స్ (Business setting )అనే ఆప్షన్  క‌నిపిస్తుంది. 

* దాన్ని క్లిక్ చేస్తే  అందులో రెండో ఆప్ష‌న్‌గా క్యాట‌లాగ్స్ (catalog) ఉంటుంది. 

*  క్యాట‌లాగ్ ఆప్ష‌న్‌ను టాప్ చేస్తే  క్రియేట్ ఏ క్యాట‌లాగ్ (create a catalog) అనే విండో ఓపెన్ అవుతుంది. దానిలో కింద యాడ్ ప్రొడ‌క్ట్ ఆర్ స‌ర్వీస్ అని కింద గ్రీన్ క‌ల‌ర్‌లో ఓ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 

*  యాడ్ ప్రొడ‌క్ట్ ఆర్ సర్వీస్‌ను టాప్ చేస్తే యాడ్ అనే విండో ఓపెన్ అవుతుంది. యాడ్ ఇమేజ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. అక్క‌డ మీ ప్రొడ‌క్ట్ ఇమేజ్‌ను యాడ్ చేయాలి. దాని కింద ప్రొడ‌క్ట్ లేదా స‌ర్వీస్ పేరు,  ప్రొడ‌క్ట్ ఖ‌రీదు ఎంట‌ర్ చేయాలి.  మోర్ ఫీల్డ్స్ అని ఇంకో లైన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ప్రొడ‌క్ట్ లింక్‌, ప్రొడ‌క్ట్ ఆర్ స‌ర్వీస్ కోడ్ అనే ఆప్ష‌న్లు వ‌స్తాయి. వాటిని కూడా ఫిల్  చేసుకోవ‌చ్చు.

* ఇవ‌న్నీ ఎంట‌ర్ చేశాక సేవ్ చేస్తే చాలు మీ వాట్స‌ప్ బిజినెస్ అకౌంట్‌లో ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ రెడీ అయిపోయినట్లే.

 

ఐవోఎస్‌లోనూ ల‌భ్యం
* ప్ర‌స్తుతం ఈ ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ ఫీచ‌ర్ వాట్సాప్ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్  రెండు వెర్ష‌న్ల‌లోనూ ల‌భిస్తుంది. 
 *  ఇండియా, యూఎస్ఏ, బ్రెజిల్‌, యూకే, మెక్సికో, ఇండోనేషియా, జ‌ర్మ‌నీ దేశాల్లోని వాట్సాప్ యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంది. మీరు ఈ దేశాల్లో ఎక్క‌డున్నా క్యాట‌లాగ్ ఫీచ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. దానిలో మీరు యాడ్ చేసే ప్రొడ‌క్ట్ వివ‌రాలు మీ ప్రొఫైల్‌లో క‌నిపిస్తాయి. దీంతో మీ బిజినెస్ డెవ‌ల‌ప్ అయ్యే అవ‌కాశాలున్నాయి. 


 

జన రంజకమైన వార్తలు