లైవ్ వీడియో వస్తుంది. మనకు ఎంతో ఇష్టమైన సందేశమో లేదా పాటో లేదో సీనో వస్తుంది. అది మీకు కావాలి... అదేంటి లైవ్‌లో వస్తున్న వీడియోను మీరు ఎలా సంపాదించాలి. అసలు ఎలా రికార్డు చేయాలి. దీనికి ఏమైనా సాఫ్ట్‌వేర్ ఉందా? అసలు ఎలా రికార్డు చేయాలి? అదెలాగో చూద్దామా..
లైవ్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వస్తుంది. దానిలో ఒక ఇన్నింగ్స్ బాగా మీకు నచ్చింది లేదా ఒక షాట్ నచ్చింది దీన్ని రికార్డు చేయాలంటే సాధారణంగా చేస్తారు. దీనికి ఒక సాఫ్ట్‌వేర్ ఉంది దాని పేరు మొవావి స్క్రీన్ రికార్డర్. లైవ్ వీడియోను రికార్డు చేయడానికి అద్భుతమైన సాఫ్ట్‌వేర్ ఇది. దీని సాయంతో మీరు స్క్రీన్స్ రికార్డు చేయడం, పోడ్‌కాస్ట్స్, ఆన్‌లైన్ రేడియో లైవ్ స్ట్రీమ్‌లను రికార్డు చేయడం లాంటివి చేయచ్చు. ఈ లైవ్ స్ట్రీమ్‌లన్నీ 60 ఎఫ్ పీఎస్ స్పీడ్‌తో రికార్డు అవుతాయి. విండోస్ మరియు మాక్‌లలో ఇవి బాగా పని చేస్తాయి.
ఎలా పని చేస్తుందంటే...
1. ముందుగా మొవామి స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయాలి. విండోస్, ఐవోఎస్ ఏదైనా ఫర్వాలేదు. నిబంధనలు ఫాలో అయి లాగిన్ డిటైల్స్ ఎంటర్ చేయాలి
2. మీరు ఏ లైవ్ రికార్డు చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్‌ను ఎంచుకోవాలి. ఏ పోర్షన్ రికార్డు చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే ఎంపిక చేసుకుని కట్ చేసుకోవాలి. చాలా రికార్డర్‌లలో సౌండ్ ఆఫ్ అయి ఉంటుంది. అందుకే రికార్డు చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి
3. ఆ తర్వాత ఆర్ ఈసీ బటన్ ప్రెస్ చేస్తే చాలు.మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు. ఎలా కావాలంటే అలా పాజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన భాగం వరకు కట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.