• తాజా వార్తలు

గూగుల్ ఫొటోస్‌లో కంప్రెషన్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

మ‌న ఫొటోలు, వీడియోల‌ను స్టోరేజ్ చేసుకోవ‌డానికి గూగుల్ ఫొటో చాలా మంచి ఆప్ష‌న్‌. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటే మీ ఫొటోల‌ను, వీడియోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సింక్ చేసుకోవ‌చ్చు... అంతేకాక ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ లేదా క్లౌడ్ స్టోరేజ్‌కు పంపుకోవ‌చ్చు. మీ ఒరిజిన‌ల్ ఫొటోస్ మాదిరిగానే ఇది మ‌న ఫొటోల‌ను దాచిపెడుతుంది. ఇది సాధార‌ణంగా ఫ్రీ అన్‌లిమిటెడ్ స్టోరేజ్‌గా ఉంటుంది. అయితే గూగుల్ ఫొటోస్‌లో కంపారిజిన్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవ‌డం ఎలాగో తెలుసుకుందాం...

ఇలా రిక‌వ‌ర్ చేయండి
స్టోరేజ్ నుంచి గూగుల్ ఫొటోస్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి కొన్ని ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇందుకోసం ముందుగా గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయాలి. టాప్ లెఫ్ట్‌లో ఉన్న హ్యాంబ‌ర్గ‌ర్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత మీకు సెట్టింగ్స్ క‌న‌బ‌డ‌తాయి. సెట్టింగ్స్‌లో అప్‌లోడ్ సైజ్ ఫ‌ర్ ఫొటో అండ్ వీడియో ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దీని రిక‌వ‌ర్ స్టోరేజ్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేయ‌డం ద్వారా మీరు సుల‌భంగా మీ ఫొటోల‌ను రిక‌వ‌ర్ చేసుకోవ‌చ్చు.

ఒరిజిన‌ల్ ఫొటో కంప్రెస్‌
మీరు మీ ఫొటోల‌ను 26 జీబీ స్టోరేజ్ వ‌ర‌కు రిక‌వ‌ర్ చేసుకోవ‌చ్చు. ఇలా చేయాలంటే ముందుగా కంప్రెస్ ఆప్ష‌న్ ఉప‌యోగించుకోవాలి. దీన్ని మీరు ఒరిజిన‌ల్ కానీ లేదా హైక్వాలిటీగా రిక‌వర్ చేసుకోవ‌చ్చు. అంతేకాదు గూగుల్ బ్లాగ్స్‌లో అప్‌లోడ్ చేసిన కంప్రెస్డ్ ఫొటోల‌ను కూడా రిక‌వ‌ర్ చేసుకోవ‌చ్చు. గూగుల్ డ్రైవ్ ద్వారా అప్‌లోడ్ చేసిన ఐట‌మ్స్‌కు ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌కుండా ఈ రిక‌వ‌ర్ చేయాలి. మీరు రిక‌వ‌ర్ స్టోరేజ్ బ‌ట‌న్ మీద క్లిక్ చేస్తే మీరు ఫొటోల‌ను కంప్రెస్ చేయ‌డం ద్వారా స్టోరేజ్ చేసుకున్న ఫొటోల‌ను చూడొచ్చు. 26 జీబీ వ‌ర‌కు మీకు  ఇలా కంప్రెస్ చేసిన ఫొటోల‌ను రిక‌వ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు