ఆన్‌లైన్‌లో మనం ఫొటోలను అప్‌లోడ్ చేసేటప్పుడు ఎదుర్కొని పెద్ద ప్రాబ్లమ్ సైజు. ఫొటో్ పెద్దదిగా ఉంటే త్వరగా అప్‌లోడ్ కావు. ఎర్రర్ మెజేస్‌లు పదే పదే వస్తాయి. దీని వల్ల చాలా సమయం కూడా వృథా అవుతుంది. అయితే ఫొటోలను మనకు నచ్చినట్లు.. నచ్చిన సైజులో కట్ చేసుకునే లేదా ఎడిట్ చేసుకునేలా కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఆప్షన్లు ఏమిటో చూద్దామా..
టీనీ జేపీజీ
ఫొటో సైజులను తగ్గించడానికి టీనీ జేపీజీ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఉచితంగా లభించే ఆన్‌లైన్ టూల్. మీరు సైజు తగ్గించాలనుకున్న ఇమేజ్‌ను డ్రాగ్ చేసుకుని ఈ టూల్‌లో ఉంచితే చాలు మిగిలిన పని అదే చూసుకుంటుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత డౌన్‌లోడ్ బటన్ ప్ర్రెస్ చేసుకుంటే చాలు. ఒరిజినల్ ఫొటో ఏ మాత్రం చెడకుండా 98 శాతం క్వాలిటీతో ఇమేజ్‌ను అందించడమే టీనీ జేపీజీ ప్రత్యేకత. 5 ఎంబీకి మించిన సైజు ఉన్న ఫొటోలను దీనిలో అప్‌లోడ్ చేయలేం. అంతేకాదు ఒక సెషన్‌కు 20 ఫొటోలను మాత్రమే సైజు తగ్గించగలం. మళ్లీ మీ అకౌంట్‌ను రిసెట్ చేసుకుని మళ్లీ ఫొటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు.
కంప్రెసర్.ఐవో
ఫొటోలను మనకు నచ్చిన సైజులో కుదించడంలో కంప్రెసెర్.ఐవో టూల్ బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. జేపీజీ, పీఎన్‌జీ, జీఐఎఫ్, ఎస్‌వీజీ ఫార్మాట్లలో ఇమేజ్‌లను మనం సేవ్ చేసుకునే వీలు కల్పిస్తుంది. మీ ఫొటోల సైజులను తగ్గించడమే కాక క్వాలిటీని మెయిన్‌టెన్ చేయడం దీని ప్రత్యేకత. మీకు అవసరమైన ఫొటోలను ఈ టూల్లో డౌన్‌లోడ్ చేసుకుని తర్వాత ట్రై ఇట్ బటన్ క్లిక్ చేస్తే చాలు. ఆ తర్వాత కొద్దిసేపటికి మీకు నచ్చిన సైజులో ఫొటోలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 10 ఎంబీ వరకు ఉన్న ఫొటోలను దీనిలో అప్‌లోడ్ చేయాలి
కంప్రైస్ నౌ
ఫొటోల ఎడిటింగ్ మరో టూల్ కంప్రెస్ నౌ. ఇది కూడా ఫొటోలను జీఐఎఫ్, జేపీజీ, పీఎన్‌జీ ఫార్మాట్లలో సేవ్ చేస్తుంది. అంతేకాదు ఫొటోలో ఏ ప్రాంతంలో మీకు తక్కుత సైజు కావాలో కూడా ఈ టూల్‌లో మనం డిసైడ్ చేసుకోవచ్చు. పర్సంటేజ్‌ల ద్వారా ఫొటో సైజు తగ్గించుకోవచ్చు. 9 ఎంబీ వరకు మనం ఫొటోలను అప్‌లోడ్ చేసే అవకాశాన్ని ఈ టూల్ కల్పిస్తుంది. మీరు సైజు తగ్గించాలనుకున్న ఫొటోను సింపుల్‌గా డ్రాగ్ చేసి కంప్రెస్ మీద క్లిక్ చేస్తే చాలు ఫొటో ఆటోమెటిక్‌గా సైజు తగ్గుతుంది. ఆ తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.