• తాజా వార్తలు

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు తెలుసా? ఒరిజిన‌ల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంది.  వినియోగ‌దారుడి స్థాయిలో విండోస్ ఓఎస్ రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి రిటైల్ యూజ‌ర్ లైసెన్స్‌.  రెండోది ఒరిజిన‌ల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చ‌ర‌ర్  (ఓఈఎం) లైసెన్స్‌. మీరు రిటైల్ యూజ‌ర్ లైసెన్స్ క‌లిగి ఉంటేనే మీ ఓఎస్‌ను వేరే పీసీ లేదా ల్యాపీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌గ‌ల‌రు. 

మీ లైసెన్స్ ఏ టైప్‌దో చెక్ చేయండి
1. మీ పీసీ స్క్రీన్ మీద ఎడమ వైపున కింద ఉంటే స్టార్ట్ లేదా విండోస్ సింబ‌ల్‌ను క్లిక్ చేసి సీఎండీ అని టైప్ చేయండి.  ఇప్పుడు క‌మాండ్ ప్రాంప్ట్ సింబల్ క‌నిపిస్తుంది. దానిమీద రైట్ క్లిక్ చేసి run as administratorను సెలెక్ట్ చేయండి. 2.

2. క‌మాండ్ ప్రాంప్ట్ విండోలో slmgr /dli అని టైప్ చేయండి. 

3. ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్ మీద క‌నిపిస్తుంది. దానిలో మీ లైసెన్స్ కీ, ఆ లైసెన్స్ రిటైల్ యూజ‌ర్ లైసెన్సా లేదా ఓఈఎం లైసెన్సా అనేది చెక్ చేసుకోండి.

మీ పీసీ రిటైల్ యూజ‌ర్ కీ క‌లిగి ఉంటే ఇప్పుడు దాన్ని వేరే పీసీకి ట్రాన్స్ ఫ‌ర్ చేయొచ్చు. 


విండోస్ 10 లైసెన్స్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా? 
1. మీ పీసీలో నుంచి  10 లైసెన్స్ కీని డీ యాక్టివేట్ చేయండి.  స్టార్ట్ లేదా విండోస్ సింబ‌ల్‌ను క్లిక్ చేసి సీఎండీ అని టైప్ చేయండి.  ఇప్పుడు క‌మాండ్ ప్రాంప్ట్ సింబల్ క‌నిపిస్తుంది. దానిమీద రైట్ క్లిక్ చేసి run as administratorను సెలెక్ట్ చేయండి. 

2. క‌మాండ్ ప్రాంప్ట్ విండోలో slmgr.vbs /upk అని టైప్ చేస్తే మీ పీసీలో నుంచి విండోస్ కీ డీ రిజిస్ట‌ర్ అవుతుంఇ. 

3. ఇప్పుడు మీ పీసీని రీస్టార్ట్ చేయండి. 

4. మ‌ళ్లీ స్టార్ట్‌లోకి వెళ్లి  క‌మాండ్ ప్రాంప్ట్ విండోలో slmgr.vbs /cpky అని టైప్ చేస్తే ఆ విండోస్ కీ ఎక్క‌డ‌న్నా వేరే ఫైల్స్‌లో రిజిస్ట‌ర్ అయి ఉన్నా డీ రిజిస్ట‌ర్ అవుతుంది. 

విండోస్ 10 లైసెన్స్ కీని కొత్త పీసీలో యాక్టివేట్ చేయాలంటే. 
1. స్టార్ట్ లేదా విండోస్ సింబ‌ల్‌ను క్లిక్ చేసి సీఎండీ అని టైప్ చేయండి.  ఇప్పుడు క‌మాండ్ ప్రాంప్ట్ సింబల్ క‌నిపిస్తుంది. దానిమీద రైట్ క్లిక్ చేసి run as administratorను సెలెక్ట్ చేయండి. 

2.  క‌మాండ్ ప్రాంప్ట్‌లో slmgr.vbs /ipk టైప్ చేసి  మీ విండోస్ లైసెన్స్ కీని ఎంట‌ర్ చేయండి.  

3. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌లో slmgr /dlv టైప్ చేసి యాక్టివేష‌న్ అయిందో లేదో వెరిఫై చేసుకోండి. 

ఇప్పుడు మీ పీసీలో మీ విండోస్ లైసైన్స్ పొందిన‌ట్లు స్టేట‌స్ చూపుతుంది.  అంటే మీ విండోస్ లైసెన్స్ కీ ట్రాన్స్‌ఫ‌ర్ స‌క్సెస్‌ఫుల్‌గా పూర్త‌యింది. 

ఒక‌వేళ యాక్టివేట్ కాక‌పోతే 
1. స్టార్ట్  క్లిక్ చేసి సీఎండీ అని టైప్ చేయండి.  ఇప్పుడు క‌మాండ్ ప్రాంప్ట్ సింబల్ క‌నిపిస్తుంది. దానిమీద రైట్ క్లిక్ చేసి run as administratorను సెలెక్ట్ చేయండి. 

2. క‌మాండ్ ప్రాంప్ట్ విండోలో slui 4 అని టైప్ చేయండి.

3. యాక్టివేష‌న్ విజార్డ్‌లో మీ రీజియ‌న్‌ను సెలెక్ట్ చేసి నెక్స్ట్ నొక్కండి. 

4. టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌కు కాల్ చేసి మీ ఇన్‌స్టాలేష‌న్ ఐడీ చెప్పి సాయం కోరండి. 

5. ఎంట‌ర్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఐడీని టైప్ చేసి మైక్రోసాఫ్ట్ స‌పోర్ట్ వారు మీకిచ్చిన క‌న్ఫ‌ర్మేష‌న్ ఐడీని అక్క‌డ ఎంట‌ర్ చేయండి.  

6. చివ‌ర‌గా యాక్టివేట్ విండోస్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయండి  

జన రంజకమైన వార్తలు