డిజిటల్ పేమెంట్స్ మన లైఫైని చాలా సులభతరం చేశాయి. అయితే డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎంత లాభం ఉందో.. అంతే నష్టం కూడా ఉంది. ఈ ఆన్లైన్ ట్రాన్నాక్షన్ల వల్ల నష్టపోయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. తాజాగా థానెకు చెందిన ఒకతను గూగుల్ పే వాడుతూ రూ. లక్ష నష్టపోయాడు. డిజిటల్ వాలెట్స్ ద్వారా స్కామ్‌స్టర్ రిక్వస్ట్‌ని యాక్పెప్ట్ చేయడం ద్వారా అతను ఈ డబ్బు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్టు చేసి గొల్లుమన్నాడు. మరి గూగుల్ పే వాడుతూ ఎలాంటి ఫ్రాడ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సెక్యూర్‌గా ఉండండి
ఫ్రాడ్ రిక్వస్ట్లు రావడం చాలా కామన్ విషయం. అయితే వీటిలో పడకుండా ఉండాలంటే మీ అకౌంట్‌ని సెక్యూర్‌గా ఉంచుకోడడం చాలా కీలకం. మీకు తెలియని వాళ్ల నుంచి ఇలాంటి రిక్వెస్ట్ వస్తే బ్లాక్ చేసేలా సెట్టింగ్ చేసుకోవాలి. మీరు గూగుల్ పేలో ఫలానా కాంటాక్ట్ నుంచి మీకు రిక్వెస్ట్ రాకూడదనుకుంటే వెంటనే బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింట్లోనూ అందుబాటులో ఉంది. ఇలాంటి రిక్వెస్ట్‌లు బ్లాక్ చేయడానికి ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లో సేమ్ స్టెప్స్ వేయాలి.
ఏం చేయాలంటే?
మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే యాప్‌ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ ఫింగర్‌ని స్లైడ్ చేస్తే మీ కాంటాక్ట్స్ కనిపిస్తాయి. సెండ్ లేదా రిసీవ్ ఆప్షన్ కూడా చూడొచ్చు. ఇందులోనే మీరు మనీ రిక్వెస్ట్ చేసే కాంటాక్ట్స్ కూడా కనిపిస్తాయి. ఇందులో మీరు బ్లాక్ చేయాలనుకున్న ఒక కాంటాక్ట్‌ని ఎంచుకుని దానిపై ట్యాప్ చేయాలి. ఆ కాంటాక్ట్ ఎదురుగా ఉన్న త్రి డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఇందులోనే రిఫ్రెష్, బ్లాక్, డిజేబుల్ చాట్, రిపోర్ట్ స్పామ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. దీనిలో బ్లాక్ ఆప్షన్‌ను ఎంచుకుని బ్లాక్ చేస్తే చాలు. వాళ్ల దగ్గర నుంచి మీకు ఎలాంటి రిక్వెస్ట్‌లు రావు.