• తాజా వార్తలు

ర‌క్తం అవ‌స‌ర‌మైతే అందుబాటులో ఉందో లేదో ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 3 సంవత్సరాల క్రితం /

ర‌క్త‌దానం ఆప‌ద‌లో ఉన్న మ‌నిషిని రక్షిస్తుంది. అయితే ఎవ‌రు ఎన్ని ర‌క్త‌దాన శిబిరాలు పెట్టినా మ‌నకో, మ‌న‌వాళ్ల‌కో  ఎప్పుడన్నా ర‌క్తం ఎక్కించాల్సిన ప‌రిస్థితి వ‌స్తే అది ఎక్క‌డ అందుబాటులో ఉందో తెలుసుకోవ‌డం త‌ల‌నొప్పే.  ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేసి బ్ల‌డ్‌బ్యాంక్ ఎక్క‌డుందో క‌నుక్కొని అక్క‌డికి వెళ్ల‌డ‌మో లేక‌పోతే ఫోన్ నెంబ‌ర్ పట్టుకుని ఫోన్ చేయ‌డ‌మో చేయాలి. అక్కడికి వెళ్లేదాకా బ్ల‌డ్ దొరుకుతుందో లేదోన‌న్న ఆందోళ‌న. వీట‌న్నింటికీ చెక్ పెడుతూ గ‌వ‌ర్న‌మెంట్ ఉమాంగ్ యాప్‌లోనే ఓ కొత్త ఫీచ‌ర్ తీసుకొచ్చింది.

ఈ-ర‌క్త‌కోశ్ స‌ర్వీస్‌
డిజిట‌ల్ ఇండియా స‌ర్వీసెస్‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ-ర‌క్త‌కోశ్ స‌ర్వీస్‌ను ప్రారంభించింది. దీంతో మీకు ద‌గ్గ‌ర‌లోని బ్ల‌డ్‌బ్యాంక్ లేదా ఆస్ప‌త్రిలో ర‌క్తం అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవ‌చ్చు. ద‌గ్గ‌ర‌లో లేక‌పోతే ప్ర‌త్యామ్నాయంగా ఎక్క‌డ దొరుకుతుందో కూడా చూపిస్తుంది. ఈ-ర‌క్త‌కోశ్  వెబ్‌సైట్‌తోపాటు ఉమాంగ్ యాప్‌లో కూడా ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. 

ఉమాంగ్ యాప్ ద్వారా
1. కేంద్ర ప్ర‌భుత్వం వివిధ ర‌కాల స‌ర్వీసులు అందించ‌డానికి ఉమాంగ్ యాప్ (Umang app)ను తీసుకొచ్చింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐవోఎస్ స్టోర్‌లో కూడా దొరుకుతుంది.  

2. ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేష‌న్ చేసుకోండి. 

3. ఇప్పుడు యాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ బ‌ట‌న్ క్లిక్ చేసి e-Rakt Kosh లేదా Blood availability అని టైప్ చేయండి.

4. సెర్చ్ రిజ‌ల్ట్స్‌లో నుంచి e-Rakt Kosh ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.  

5. చెక్ బ్ల‌డ్ అవాయిల‌బిలిటీ (Check Blood Availability) ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి. 

6. ఇప్పుడు లొకేష‌న్‌, బ్ల‌డ్‌బ్యాంక్ ఎంత దూరంలో ఉండాల‌నుకుంటున్నారు, మీకు ఏ గ్రూప్ రక్తం కావాల‌నుకుంటున్నారు, ఎన్ని యూనిట్లు కావాలి వంటి ఇన్ఫ‌ర్మేష‌న్ ఎంట‌ర్ చేయండి.

7. త‌ర్వాత కిందికి స్క్రోల్ చేస్తే అందుబాటులో ఉన్న వివ‌రాలు వ‌స్తాయి. హాస్పిటల్ లేదా బ్ల‌డ్‌బ్యాంక్ పేరు, ఫోన్ నెంబ‌ర్‌, అడ్ర‌స్‌,  వివిధ ర‌కాల గ్రూప్‌ల బ్ల‌డ్ ఎంత ఉంది వంటి వివ‌రాల‌న్నీ క‌నిపిస్తాయి. 

ఈ- ర‌క్త‌కోశ్ వెబ్‌సైట్‌లో 
1. https://www.eraktkosh.in/ అని బ్రౌజ‌ర్‌లో టైప్ చేసి సెర్చ్ నొక్కండి. 

2. కిందికి స్క్రోల్ డౌన్ చేసి Check Blood Availability అనే బ‌ట‌న్‌ను క్లిక్ చేయండి. 

3. త‌ర్వాత పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, కావాల్సిన బ్ల‌డ్ గ్రూప్ వంటి వివ‌రాల‌న్నీ ఎంట‌ర్ చేస్తే ర‌క్తం ఎక్క‌డ అందుబాటులో ఉన్న‌దీ చూపిస్తుంది.  

జన రంజకమైన వార్తలు