• తాజా వార్తలు

మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ  గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు  వచ్చే అవకాశలున్నాయి.   

గూగుల్ ఫిట్ యాప్ తో    

గూగుల్ ఫిట్ (google fit) యాప్ లో ఈ నూతన అప్డేట్ ను చేర్చనుంది. ఆప్టికల్ ఫ్లో అనే కంప్యూటర్ విజన్ టెక్నిక్‌ను ఉపయోగించి శ్వాసకోశ రేటును కొలుచుకోవచ్చు. స్మార్ట్ ఫోన్  కెమెరాను ఉపయోగించి హార్ట్ బీట్ రేటును కొలుచుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఎలా తెలుసుకోవచ్చు?                            

* గూగుల్ ఫిట్ యాప్ ఓపెన్ చేసి పిక్సెల్ ఫోన్ లో ఉండే ఫ్రంట్ కెమెరా తెరిచి ఊపిరి పీల్చుకుంటూ మీ శ్వాసకోశ రేటును కొలుచుకోవచ్చు.                            

 * ఫోన్  బ్యాక్ కెమెరా లెన్స్ మీద  బొటన వేలు పెట్టి హృదయ స్పందన రేటును చెక్ చేసుకోవచ్చు.               *ఎప్పటికప్పడు ఈ డేటా  సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా గూగుల్ ఫిట్ యాప్లో   పొందుపర్చనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

జన రంజకమైన వార్తలు