టెక్స్ట్ మెసేజ్ చేయడం ఒకప్పుడు సెల్ఫోన్లో చాలా తలనొప్పి వ్యవహారం. క్యారెక్టర్లు పెరిగితే మెసేజ్ వెళ్లేది కాదు. తర్వాత టెలికం ఆపరేటర్లు అలాంటి పొడవాటి మెసేజ్‌లను రెండు, మూడు కింద ఆటోమేటిగ్గా కట్ చేసి సెండ్ చేసే ఆప్షన్ తెచ్చారు. అయితే ఎంత చేసినా టెక్స్ట్ మెసేజ్ మాత్రం వెళ్లేది. ఏదైనా ఒక చిన్న ఫొటో పంపాలంటే ఎంఎంఎస్ చేయాలి. దానికి బోల్డంత ఖర్చు, గంటలు గంటలు టైం పట్టేది. వాట్సాప్ వచ్చాక మెసేజింగ్ స్వరూపమే మారిపోయింది. మెసేజ్‌లు ఏంటి? ఫొటోలు, వీడియోలు, ఎంపీ 3 పాటలు ఇలా అన్నీ సెండ్ చేసేస్తున్నాం. ఇప్పుడు వాట్సాప్‌లో ట్రెండ్ అంటే జిఫ్‌లు. వీటిని మన వీడియోలను ఉపయోగించి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు.
జిఫ్ అంటే ఏమిటి?
జిఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్‌ఛేంజ్ ఫార్మాట్. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్‌ల్లో జిఫ్‌లను షేర్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ వీడియోలతో జిఫ్‌లు తయారుచేసి వాళ్లకు సెండ్ చేస్తే ఆ మజాయే వేరు.
వాట్సాప్‌లో జిఫ్ ఈజీగా క్రియేట్ చేసుకోవడం ఎలా?
వాట్సాప్ యూజర్లు జిఫ్‌లు సెండ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఆప్షన్ ఉంది. ఎందుకంటే వాట్సాప్‌లో దాన్ని సులువుగా క్రియేట్ చేయొచ్చు. అక్కడి నుంచే సెండ్ చేయొచ్చు. దాన్ని ఆటోమేటిగ్గా సేవ్ కూడా చేసుకోవచ్చు.
వాట్సాప్‌లో మీ సొంత జిఫ్‌లు క్రియేట్ చేసుకోవడం ఎలా?
* వాట్సాప్‌లో జిఫ్ క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మీ ఫోన్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి.
* మీరు ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి.
* చాట్ బాక్స్ ఓపెన్ చేశాక అటాచ్మెంట్ క్లిక్ చేసి మీ గ్యాలరీలో నుంచి వీడియోను సెలక్ట్ చేసుకోండి.
* జిఫ్ చేసుకోవాలంటే వీడియో లెంత్ 6 సెకన్లకు మించకూడదు. అంతకంటే ఎక్కువ నిడివి ఉంటే వీడియోను 6 సెకన్లకు తగ్గించాలి.
* వీడియో 6 సెకన్లకు కుదించాక టైమ్‌లైన్‌లో జిఫ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని టాప్ చేయండి. అంతే మీ వీడియో జిఫ్‌గా మారిపోతుంది.
* ఈ జిఫ్కు మీరు క్యాప్షన్ లేదా టెక్స్ట్యాడ్ చేసుకుని సెండ్ చేయొచ్చు.
* ఈ జిఫ్ ఇప్పుడు ఆటోమేటిగ్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది.