ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కరోనా పీడపోయి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం. ఇందుకోసం వాట్సాప్ స్టిక్కర్స్ సొంతంగా తయారుచేసుకోవడం ఎలాగో చూద్దాం
వాట్సాప్‌లో న్యూఇయర్ గ్రీటింగ్స్ తయారుచేయడం ఎలా?
1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లో Sticker Maker యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
2. యాప్ డౌన్‌లోడ్ అయ్యాక Create a new stickerpackను క్లిక్ చేయండి.
3. ఇప్పడు ఆ ప్యాక్‌కి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి.
4. ప్రతి ప్యాక్లోనూ 15 స్టిక్కర్లు ఉంటాయి. వాట్సాప్‌లో ఆ స్టిక్కర్ ప్యాక్ యాక్సెస్ చేయాలంటే కనీసం 3 స్టిక్కర్లు తయారుచేసుకోవాలి.
5. స్టిక్కర్‌లో ఉన్న ఫోటో బాక్స్‌ను టాప్ చేసి మీ ఫోటో తీసుకోండి. లేదంటే గ్యాలరీలో ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇందుకోసం ఓపెన్ గ్యాలరీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
6. ఫోటో సెక్ట్ చేసుకున్నాక దాన్ని మీకు కావాల్సిన సైజుకు క్రాప్ చేసుకోండి.
7. క్రాప్ చేసుకున్నాక మీ గ్రీటింగ్స్ టెక్స్ట్‌ను యాడ్ చేయండి.
8. ఇప్పుడు ఆ స్టిక్కర్‌ను సేవ్ చేసుకోండి. ఇలా కనీసం 3 స్టిక్కర్లు తయారుచేసుకుంటేనే ఆ స్టిక్కర్ ప్యాక్‌ను మీరు వాట్సాప్‌లో యాక్సెస్ చేయగలుగుతారు.
9. ఇప్పుడు చివరిగా Add to WhatsAppను టాప్ చేయండి.
10. ఇప్పుడు వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి మీరు ఎవరికి గ్రీటింగ్స్ పంపాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేయండి. ఎమోజీ ఐకాన్‌ను టాప్ చేసి వాట్సాప్ న్యూ ఇయర్ స్టిక్కర్స్ యాడ్ చేసి వారికి పంపించి శుభాకాంక్షలు అందజేయండి.