• తాజా వార్తలు

వాట్సాప్ వెబ్ లో వీడియో కాల్స్ చేయడం ఎలా?  

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

వాట్సాప్‌లో చేసే పనులన్నీ వాట్సాప్ వెబ్ లో కూడా చేయొచ్చు. కానీ వాట్సాప్‌లో మాదిరిగా వీడియో కాల్స్ చేసుకోవడం వెబ్ వెర్షన్లో వేలు కాదు. అయితే మీ పీసీకి వున్న వెబ్ కెమెరాను ఉపయోగించి వాట్సాప్ వెబ్ ద్వారా కూడా వీడియో కాల్స్ చేసుకునే ట్రిక్ ఒకటి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మీ పీసీను కళ్ళు గప్పి వీడియో కాల్స్ చేసుకోవడమే

ఎలాగంటే.. 
మీ పీసీ ద్వారా వాట్సాప్ వీడియో  కాల్స్ చేయడానికి మీరు వాట్సాప్ వెబ్‌ను నేరుగా వాడకూడదు. దానికి బదులుగా వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ వినియోగించాలి. 

* పీసీ లేదా మ్యాక్‌లో మీరు ఆండ్రాయిడ్ యాప్ వాడాలంటే  ముందుగా బ్లూ స్టాక్ (Blue Stack) అనే ఆండ్రాయిడ్ ఎమ్యులేట‌ర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.  పీసీలో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. 

* బ్లూస్టాక్‌ను ఓపెన్ చేసి వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేయాలి .

* వాట్సాప్ యాప్ డౌన్‌లోడ్ అయ్యాక దాన్ని ఓపెన్ చేయాలి.  స్క్రీన్ మీద వ‌చ్చే సూచ‌న‌లు పాటిస్తూ ముందుకెళ్లండి. అగ్రీ అండ్ కంటిన్యూను సెలెక్ట్ చేయండి. మీ ఫోన్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయండి.

* ఇప్పుడు మీకు కాంటాక్ట్ లిస్ట్ క‌నిపిస్తుంది. వారిలో మీరు ఎవ‌రికి కాల్ చేయాల‌నుకుంటే వారికి వాట్సాప్ వీడియో కాల్ చేయండి. వాట్సాప్ మొబైల్ యాప్‌లో ఎలా వీడియో కాల్ చేస్తామో అలాగే కాల్ ఆప్ష‌న్‌లోకి వెళ్లి వీడియో కాల్ ఐకాన్‌ను టాప్ చేయండి. 

* కాల్ సెలెక్ట్ చేసి క‌న్‌ఫ‌ర్మ్ చేయండి.  Continue ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి వాట్సాప్‌కి మీ పీసీ యొక్క మైక్‌, కెమెరాల యాక్సెస్ ఇవ్వండి.  ఇత‌ర వాటిని కూడా ఎలౌవ్ చేసి  ఆడియో రికార్డింగ్, పిక్చ‌ర్స్‌ను యాక్సెస్ చేయ‌డానికి అవ‌కాశ‌మివ్వండి.  

* ఇప్పుడు వీడియో కాల్ ప్రారంభ‌మ‌వుతుంది.  మొబైల్‌లో వాట్సాప్ వీడియో కాల్ ఎలా మాట్లాడ‌తామో అలాగే పీసీలో కూడా వాట్సాప్ వీడియో కాల్ చేసుకోండి. 

ఇదే ట్రిక్‌
వాట్సాప్ వెబ్ ద్వారా వీడియో కాల్ చేసే ఆప్ష‌న్ లేదు. అందుకే మీ పీసీలో మీరు ఈ ఎమ్యులేట‌ర్ యాప్ ద్వారా వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వాట్సాప్ కాల్ చేసుకుంటారు. అంటే ఒక‌ర‌కంగా మీరు పీసీలో వీడియో కాల్ చేస్తున్నా అది మొబైల్ యాప్ నుంచి చేస్తున్న‌ట్లే అన్న‌మాట‌.  

 

జన రంజకమైన వార్తలు