• తాజా వార్తలు

అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

  • - ఎలా? /
  • 3 సంవత్సరాల క్రితం /

 అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499  రూపాయలకే ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు. 
  ఎలా పొందాలంటే? 
 * మీ స్మార్ట్ ఫోన్ లో అమెజాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే మీ ఫోన్లో అమెజాన్ యాప్ ఉంటే మళ్ళీ డౌన్లోడ్ చేయక్కర్లేదు. 
 * యాప్ లోకి సైన్ ఇన్ అయ్యాక ఎడమవైపున మెనూలో అమెజాన్ ప్రైమ్ కనిపిస్తుంది. దాన్ని టాప్ చేయండి.        
 * ప్రైమ్ సెక్షన్లో యూత్ ఆఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. 
* Continue to Join a year of Prime at Rs 999 అన్న లింక్ మీద క్లిక్ చేయండి.                         
 * మీరు మొత్తం 999 రూపాయలకు పేమెంట్ చేయాలి. 
 * మీ వయసు 24 సంవత్సరాలలోపే ఉందని చూపే పాన్ కార్డు, స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఐడి కార్డు, ఒక సెల్ఫీ ని వారం రోజుల్లోగా అప్లోడ్ చేయాలి.      
 * అమెజాన్ వాటిని వెరిఫై చేసి 500 రూపాయలను అమెజాన్ పే అకౌంట్లో యాడ్ చేస్తుంది. దాన్ని మీరు అమెజాన్ లో ఏదయినా కొనుక్కోవడానికి లేదా అమెజాన్ పే ద్వారా బిల్స్ లేదా షాప్స్ లో ఏదయినా కొన్నప్పుడు వాడుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు