• తాజా వార్తలు

అమెజాన్‌లో గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేసి 50 రూపాయ‌లు క్యాష్‌బ్యాక్ పొంద‌డం ఎలా?

ఈకామ‌ర్స్ లెజెండ్ అమెజాన్ త‌న అమెజాన్ పే ద్వారా ఎన్నో  స‌ర్వీస్‌లు అందిస్తోంది. రీసెంట్‌గా ట్రైన్ టికెట్స్ బుకింగ్‌, గ్యాస్ సిలెండ‌ర్ బుకింగ్ వంటివి కూడా దీనిలో చేర్చింది.  దీని ద్వారా గ్యాస్ బుక్ చేస్తే ఫస్ట్ టైమ్ 50 రూపాయ‌ల క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. దీన్ని ఎలా పొందాలో చూడండి.  

 ఎలా బుక్ చేసుకోవాలంటే?
* అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
* ఇందులో సైడ్ మెనూలో అమెజాన్ పే అనే ఆప్ష‌న్ ఉంటుంది.
* దాన్ని క్లిక్ చేస్తే అమెజాన్ పే ద్వారా పొంద‌గ‌లిగే స‌ర్వీసుల‌న్నీ క‌నిపిస్తాయి.
* వాటిలో నుంచి గ్యాస్ సిలెండ‌ర్ బొమ్మ‌తో ఉన్న బుక్ గ్యాస్ సిలెండ‌ర్ ఆప్ష‌న్ క్లిక్ చేయండి.
* మీ గ్యాస్ క‌నెక్ష‌న్ ఏ కంపెనీద‌యితే అది అంటే భార‌త్‌, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ ఏదైతే దాన్ని క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీ గ్యాస్ క‌నెక్ష‌న్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయండి.
* త‌ర్వాత గ్యాస్ రీఫిల్ ఎంత ధ‌ర అయితే దాన్ని అమెజాన్ పే ద్వారా చెల్లించండి.
* బుక్ చేసిన 3 రోజుల్లోగా మీకు 50 రూపాయ‌లు అమెజాన్ పే లో యాడ్ అవుతుంది. దాన్ని మీరు అమెజాన్‌లో దేనికైనా వాడుకోవ‌చ్చు. 

500 రూపాయ‌ల మినిమం బిల్‌తోనే
అయితే ఈ 50 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ క‌నీసం 500 రూపాయ‌లు గ్యాస్ బుకింగ్‌కు ఖ‌ర్చు పెడితేనే వ‌స్తుంది. ఇప్పుడు గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర 500 కంటే ఎక్కువే ఉంది కాబ‌ట్టి మీరు అమెజాన్ పేతో సిలిండ‌ర్ బుక్ చేయ‌గానే ఆటోమేటిగ్గా 50 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ పొంద‌గ‌ల‌రు. అయితే ఈ ఆఫ‌ర్ న‌వంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 1లోపు అమెజాన్ పేతో గ్యాస్ సిలెండ‌ర్ బుక్ చేసిన‌వారికే ఈ 50 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

జన రంజకమైన వార్తలు