ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు బాగా పాపులరయిన సోషల్ నెట్వర్కింగ్ యాప్స్‌లో ఒకటి. అయితే దీనిలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు
మీ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. దీనితో మీకు తెలియని వ్యక్తుల నుంచి కూడా మెసేజ్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీ అకౌంట్ నుంచి ఫోన్ నంబర్ రిమూవ్ చెయ్యాలి. దీనికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌లో కూడా ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఉపయోగించి మీ ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఫోన్ నంబర్ రిమూవ్ చేయడం ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఎలా రిమూవ్ చేయాలంటే..
1. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళండి.
2. అక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని టాప్ చేయండి.
3. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ లో ఫోన్ నంబర్ మీద టాప్ చేయండి.
4. ఇప్పుడు ఫోన్ నంబర్ రిమూవ్ చేయండి.
5. నెక్స్ట్ బటన్ నొక్కి మీరు చేసిన మార్పులను సేవ్ చేయండి.
6. ఇప్పుడు మళ్లీ ఎడిట్ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి పైన కుడి వైపున ఉన్న టిక్ మార్కును క్లిక్ చేయండి. మీరు చేసిన మార్పులు సేవ్ అవుతాయి.
7. కొన్ని సెకన్ల తర్వాత పేజీ రీలోడ్ అవుతుంది. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నంబర్ లేకుండానే సేవ్ అవుతుంది.
8. వెంటనే మీ అకౌంట్‌కి సింక్ అయి ఉన్న ఈ మెయిల్‌కి ఇన్స్టాగ్రామ్ డేటా బేస్ నుంచి మీ ఫోన్ నంబర్ రిమూవ్ చేసినట్లు మెయిల్ వస్తుంది.
యాపిల్ ఫోన్లలో ఎలా?
ఐఓఎస్ యాప్స్‌లో కూడా ఇదే విధంగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా ఫోన్ నంబర్ రిమూవ్ చేయొచ్చు.