• తాజా వార్తలు

షియోమి ప్రొడ‌క్ట్స్‌లో ఫేక్‌వి క‌నిపెట్ట‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

షియోమి.. ఈ  చైనా కంపెనీ ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌ను శాసిస్తోంది. ఇండియాలో  అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న మొబైల్స్ షియోమి, రెడ్‌మీవే. శాంసంగ్ కూడా దీని త‌ర్వాతే. కొత్త‌గా ఏదైనా మోడ‌ల్ లాంచ్ చేస్తే షియోమి, రెడ్‌మీ ఫోన్లు ఫ్లాష్ సేల్స్‌లో వెంట‌నే దొర‌క‌వు.  చాలామంది వీటిని బ్లాక్‌లో కూడా కొంటుంటారు. ఇంత డిమాండ్ ఉన్న‌ప్పుడు స‌హ‌జంగానే న‌కిలీ ప్రొడ‌క్ట్స్ మార్కెట్లోకి వ‌చ్చేస్తుంటాయి. షియోమి కూడా ఇప్పుడు అదే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది.  ఫేక్ ప్రొడ‌క్ట్స్‌, కాపీ ఫోన్లు, ఎంఐ బాండ్లు, ప‌వ‌ర్ కేబుల్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇక ఎంఐ ప‌వ‌ర్ బ్యాంక్స్‌లో అయితే న‌కిలీల బెడ‌ద అంతా ఇంతా కాదు. ఈ ప‌రిస్థితుల్లో షియోమి ప్రొడ‌క్ట్స్‌లో ఫేక్‌వి ఎలా క‌నిపెట్టాలో తెలుసుకోవాల్సిందే. 

ఎంఐ ప‌వ‌ర్ బ్యాంక్స్‌
అత్య‌ధికంగా న‌కిలీలు వ‌స్తున్న షియోమి ప్రొడ‌క్ట్ ఎంఐ ప‌వ‌ర్ బ్యాంక్‌. అందుకే వీటిని పెద్ద‌గా ఫేమ‌స్ కాని ఈకామ‌ర్స్ సైట్ల‌లో కొనొద్దు. పెద్ద ఈ కామ‌ర్స్ కంపెనీల్లోనూ ఒక్కోసారి న‌కిలీవి వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. ఒరిజిన‌ల్ ఎంఐ ప‌వ‌ర్ బ్యాంక్‌లో  Li-Poly బ్యాట‌రీ ఉంటుంది. ప‌వ‌ర్ బ్యాంక్ మీద అదే రాసి ఉంటుంది.  అలా కాకుండా Li-ion  లేదా Li-oin బ్యాట‌రీ ఉంద‌ని రాసి ఉంటే మాత్రం అవి న‌కిలీవేనని షియోమి చెబుతోంది. 
 

ఫేక్ ఎంఐ కేబుల్స్‌
బాగా సులువుగా నకిలీలు పుట్టించ‌గ‌ల ప్రొడ‌క్ట్ ఎంఐ యూఎస్‌బీ కేబుల్. అయితే దీన్ని కూడా మ‌నం ఈజీగానే గుర్తు ప‌ట్టేయ‌వ‌చ్చు. దీని బిల్డ్ క్వాలిటీ నాసిర‌కంగా ఉంటుంది. కేబుల్ విరిస్తే విరిగిపోయేలా క‌నిపిస్తుంది. దీంతో ఛార్జింగ్ పెడితే చాలా స్లోగా ఎక్కుతుంటే అది న‌కిలీదేన‌ని గుర్తు ప‌ట్టేయ‌వ‌చ్చు.  

ఫేక్ ఎంఐ బాండ్స్‌
షియోమి ప్రొడ‌క్ట్స్‌లో బాగా పాపుల‌ర‌యినవి ఎంఐ వేర‌బుల్ బాండ్స్‌. టైమ్‌తోపాటు ఫిజిక‌ల్ యాక్టివిటీ ట్రాక‌ర్లుగా ఉప‌యోగ‌ప‌డే ఈ బాండ్స్ కూడా న‌కిలీవి వ‌చ్చేస్తున్నాయి. వీటిని గుర్తుప‌ట్టడానికి సింపుల్ ట్రిక్ ఉంది. మీ ఫోన్‌లో ఎంఐ ఫిట్ యాప్ ఓపెన్ చేసి ఈ బాండ్‌తో క‌నెక్ట్ చేయండి.  ఒరిజిన‌ల్ అయితే క‌నెక్ట్ అవుతుంది. 

లోగో చెక్ చేయండి
షియోమి ప్రొడ‌క్ట్స్ మీద ఎంఐ లోగో ఉంటుంది. న‌కిలీ ప్రొడ‌క్ట్‌ల మీద కూడా ఈ లోగో ఉంటుంది. అయితే ఒరిజిన‌ల్ మీద లోగోకు, వీటికీ తేడా ఉంటుంది. కాస్త జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే మీకు తెలిసిపోతుంది.  

ప్రొడ‌క్ట్ సెక్యూరిటీ కోడ్ చూడండి
ఒరిజిన‌ల్‌ ప్రొడ‌క్ట్స్ మీద యూనిక్‌ కోడ్స్ ఉంటాయి.  వీటిని షియోమి అఫీషియ‌ల్ సైట్ mi.comలోకి వెళ్లి కంపేర్ చేసుకోండి.  ఒరిజిన‌ల్ అయితే మీ కోడ్ మ్యాచ్ అవుతుంది. 

ప్యాకింగ్‌లో తేడా తెలుస్తుంది
ఒరిజిన‌ల్ షియోమి ప్రొడ‌క్ట్స్ కంపెనీ నుంచి మంచి క్వాలిటీ ప్యాకింగ్‌తో వ‌స్తాయి. నకిలీవి ప్యాకింగ్ చీప్‌గా ఉంటుంది. తేడా ఈజీగానే తెలుస్తుంది.  

షియోమి వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొనండి. 
అసలు ఈ న‌కిలీల గోలంతా మ‌న‌కెందుకు అనుకుంటే మీకో ఆప్ష‌న్ కూడా ఉంది. అది నేరుగా షియోమి వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొనుక్కోవ‌డం. కంపెనీ సొంత వెబ్‌సైట్ కాబ‌ట్టి అక్క‌డ న‌కిలీలకు ఛాన్స్ ఉండ‌దు. 

 
 

జన రంజకమైన వార్తలు