• తాజా వార్తలు

వాట్సాప్ గ్రూప్ చాట్స్‌ను సిగ్న‌ల్ యాప్‌లోకి మార్చుకోవ‌డం ఎలా?

వాట్సాప్ వినియోగ‌దారుల డేటాను త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామ‌ని, ఇందుకు అనుగుణంగా త‌యారుచేసిన తాజా  ప్రైవ‌సీ పాల‌సీని వినియోగ‌దారులంతా అంగీక‌రించాల్సిందేన‌ని జ‌న‌వ‌రి 4న వాట్సాప్ ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 8లోగా కొత్త ప్రైవ‌సీ పాల‌సీని యూజ‌ర్లు యాక్సెప్ట్ చేయాల‌ని, లేక‌పోతే త‌ర్వాత వారు వాట్సాప్ వాడుకోవ‌డం కుద‌ర‌ద‌ని తేల్చేసింది.   దీంతో చాలామంది సిగ్న‌ల్ అనే మెసేజింగ్ యాప్‌కు మారిపోతున్నారు.  వ్య‌క్తిగ‌త కాంటాక్ట్‌ల‌యితే సిగ్న‌ల్ యాప్ ద్వారా చేసుకోవ‌చ్చు. గ్రూప్ చాటింగ్ ఎలాగ‌నుకుంటున్నారా. దానికీ ఓ మార్గం ఉంది.| 

వాట్సాప్ గ్రూప్ చాట్‌ను సిగ్న‌ల్ యాప్‌లో వాడుకోవ‌డం ఎలాగంటే..  

* మీ స్మార్ట్‌ఫోన్‌లో సిగ్న‌ల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 
*  మీ ఫోన్ నంబ‌ర్‌, ఫోటో పెట్టుకుని అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోండి.  
* ఇప్పుడు మీ కాంటాక్ట్‌ల‌ను యాడ్ చేసుకోండి.
*  త‌ర్వాత  సిగ్న‌ల్ యాప్‌ను ఓపెన్ చేసి త్రీడాట్స్ మెనూలోకి వెళ్లండి.
* సెట్టింగ్స్ సెలెక్ట్ చేసి గ్రూప్ లింక్‌ను క్లిక్ చేయండి.
* గ్రూప్ లింక్‌ను టాగుల్ చేసి షేర్ ఆప్ష‌న్‌ణు క్లిక్ చేయండి.  
* ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేసి ఆ గ్రూప్ లింక్‌ను కాపీ చేయండి.
* దీన్ని ఇప్పుడు మీ సిగ్న‌ల్ యాప్ చాట్‌లో పేస్ట్ చేయండి.
* అంతే ఇక మీ వాట్సాప్ గ్రూప్ చాట్‌ను ఇక మీరు కొత్త‌గా డౌన్‌లోడ్ చేసిన సిగ్న‌ల్ యాప్‌లో వాడుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు