• తాజా వార్తలు

గూగుల్ ప్లే మ్యూజిక్ ఆగిపోయింది.. మీ ఆల్బ‌మ్స్‌ను యూట్యూబ్ కు ట్రాన్స్ఫర్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 3 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను ఇన్నాళ్లూ ఆల‌రిస్తూ వ‌చ్చిన గూగుల్ ప్లే మ్యూజిక్ స‌ర్వీస్ ఆగిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న‌వాళ్లంద‌రికీ గూగుల్ ప్లే మ్యూజిక్ ఓపెన్ చేయ‌గానే మీ ఆల్బ‌మ్స్‌, ప్లే లిస్ట్‌ల‌న్నింటినీ యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోండి అని ఓ మెసేజ్ క‌నిపిస్తుంది. అంటే మీ ఆల్బమ్స్, ప్లే లిస్ట్‌లు ఇక గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ప్లే కావు. కాబట్టి వాటిని ప్ర‌త్యామ్నాయంగా యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలి. అదెలాగో చూద్దాం.

గూగుల్ ప్లే మ్యూజిక్‌ను యూట్యూబ్ మ్యూజిక్ ట్రాన్స్ఫ‌ర్ చేయ‌డం ఎలాగంటే..
 * యూట్యూబ్ మ్యూజిక్ ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
* ఈ యాప్‌లో మీకు ఓ ట్రాన్స్ఫ‌ర్ బ‌ట‌న్ క‌నిపిస్తుంది. 
* ఆ బ‌ట‌న్ క్లిక్ చేస్తే మీ గూగుల్ ప్లే మ్యూజిక్ ప్లేలిస్ట్‌లు, ఆల్బ‌మ్స్‌, మీరు డ‌బ్బులు పెట్టిన మ్యూజిక్ కంటెంట్ ఉంటే అది కూడా యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. 
* మీ మ్యూజిక్ కంటెంట్ ట్రాన్స్ఫ‌ర్ పూర్త‌వ‌గానే మీకు ఈ మెయిల్ నోటిఫికేష‌న్ వ‌స్తుంది. 
*ఇక గూగుల్ మ్యూజిక్ ప్లేలో మీరు ఏ విధ‌మైన కంటెంట్‌ను వాడుతున్నారో అలాంటి వాటికి సంబంధించిన రిక‌మండేష‌న్స్ అన్నీ మీకు యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో కూడా క‌నిపిస్తాయి.  
* అంటే ఒక‌ర‌కంగా చెప్పాలంటే మీ గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్‌ను యూట్యూబ్ మ్యూజిక్ యాప్ రీప్లేస్ చేసిన‌ట్ల‌న్న‌మాట‌.

జన రంజకమైన వార్తలు